Traffic Challan: ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడం మామూలే. వాహనాలను ఆపి చలాన్ వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి అంతా హైటెక్. ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలబడినా.. హెల్మెట్ పెట్టుకోకపోయినా.. రాంగ్ రూట్ లో వెళ్తున్నా.. ట్రాఫిక్ పోలీసులు కెమెరా క్లిక్ మనిపిస్తూ చలాన్ జారీ చేస్తున్నారు. అయితే మన వాహనానికి చలానా పడిందా లేదా అని తెలుసుకోవాలంటే వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాహనం నంబర్‌ను నమోదు చేసి వివరాలు పొందుతాం. అయితే దానికి బదులు తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ట్రాఫిక్ చలాన్ పెండింగ్ లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కొత్త ప్రతిపాదన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Read also: Musi River: ఉప్పొంగుతున్న మూసీ నది.. భయం గుప్పిట్లో ప్రజలు..
వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మొబైల్ నంబర్‌కు నేరుగా ట్రాఫిక్ చలాన్‌లు పంపే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అంతే కాకుండా సులువుగా బిల్లుల చెల్లింపునకు వీలుగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ యాప్, యూపీఐ ఆప్షన్‌లను అందించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వాహనదారుల నుంచి పెద్దమొత్తంలో పెండింగ్‌లో ఉన్న చలాన్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని భావించిన అధికారులు ఈ ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ వ్యవస్థను త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానం నేరుగా రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. కొన్ని నగరాల్లో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్నారు. చలాన్ వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో పంపబడుతుంది మరియు చలాన్‌ల చెల్లింపు UPI మోడ్‌లో తీసుకురాబడుతుంది.
Nagarjuna Sagar: మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత…