Nagarjuna Sagar: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం కృష్ణమ్మ మళ్లీ పోటెత్తింది. ఎగువన ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ప్రవళులు తొక్కుతూ శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి సాగర్ 26 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు విడుదల చేస్తున్నారు. 12 గేట్లు 10 అడుగులు, 14 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు.
Read also: Tungabhadra Dam: మళ్లీ నిండిన తుంగభద్ర డ్యామ్.. ఇవాళ గేట్లు ఎత్తనున్న అధికారులు
సాగర్ నుంచి 4,65,222 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల.. సాగర్ ఇన్‌ఫ్లో 4,91,792, ఔట్‌ఫ్లో 5,01,014 క్యూసెక్కులు.. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 588.90 అడుగులకు చేరింది. దీంతో దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు 2,70,349 క్యూసెక్కుల వరద వస్తుండగా, 3,10,395 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల దిగువన నదీ పరివాహక ప్రాంతంలో (బేసిన్) కురిసిన భారీ వర్షాలు ఈ ప్రవాహంతో కలిసి ప్రకాశం బ్యారేజీ పొంగిపొర్లుతున్నాయి. బ్యారేజీలోకి 3,31,829 క్యూసెక్కులు వస్తుండగా, గేట్లను ఎత్తి 3,18,160 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 184 టీఎంసీల కృష్ణా నీరు సముద్రంలోకి చేరింది.
All Time IPL XI: ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్‌కు దక్కని చోటు! కెప్టెన్‌గా..