Musi River: హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంతి. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్ సాగర్ లో 513.43 మీటర్లుగా ఉన్న ప్రస్తుత నీటి మట్టం కాగా.. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లకు చేరింది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసిలోకి వదులుతున్న అధికారులు. మూసి పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.
Read also: Nagarjuna Sagar: మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత…
రెండురోజులుగా కురుస్తున్న వానలకు హైదరాబాద్ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు జంట జలాశయాల నుంచి విడుదల చేసిన నీటితో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పరిహాక ప్రాంతాల ప్రజలు… భయంతో అల్లాడుతున్నారు. పురానాపూల్ ముద్ద నీటితో నిండిపోయింది. భారీగా వరద నీరు చేరడంతో పరిసర ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. పురానాపూల్, జియాగూడ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జియాగూడ ప్రాంతంలో చెరువులకు వెళ్లే రహదారులతో వాహనాల రాకపోకలను నియంత్రించారు. చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు.
Read also: Re – Release : మురారి, ఇంద్ర రీరిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన.. గబ్బర్ సింగ్..
ముసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూసా నగర్, కమలా నగర్ పరిసరాలు మూసాయి వరద ముంపునకు గురైంది. మూసీ పరివాహక ప్రాంతంలోని చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్‌నగర్ కాలనీల వాసులను అధికారులు అప్రమత్తం చేసి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగోల్ పరిధిలోని అయ్యప్పకాలనీ కూడా వరద నీటిలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారులోని లోలెవల్ వంతెనపై నుంచి ఎగువన ప్రవహిస్తోంది. దీంతో భూదాన్ పోచంపల్లి మండలంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద… లోలెవల్ వంతెనపై నుంచి మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
Red Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..