Justice for VOA: కొమురం భీం జిల్లా కేంద్రంలో వివో ఏల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. కలెక్టరేట్ గేటు ముందు వివోఏలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేగాక గేటును తాళ్ళతో కట్టేసి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేసారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ అక్కడకు వచ్చిన లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గేటు కట్టిన తాళ్లను తీయకుండా నిరసన చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వీవోఏలను ఎంత చెప్పిన వినకుండా నిసనలు చేపట్టారు.
దీంతో అడిషనల్ కలెక్టర్ వెనుతిరిగారు. ఆ తర్వాత ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. వీఓఏలను అదదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, వీఓఏలు వాగ్వాదానికి దిగారు. సమస్యలు పరిస్కరించేంత వరకు నిరసన ఆపే ప్రసక్తే లేదని వీఓఏలు తేల్చి చప్పడంతో పోలీసులు వారిని అదుపుచేసేందుకు ప్రయ్నతించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చేస్తున్న తీరును తప్పుబడుతూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీఓఏలను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Airport beggar: ఎయిర్‌పోర్టుల్లోనే బెగ్గింగ్.. ఈ బిచ్చగాడు యమ రిచ్..