కలుషిత ఆహార నగరంగా విశాఖ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
విశాఖ కలుషిత ఆహార నగరంగా మారింది.. చిన్నపిల్లలు తినే తిండి దగ్గర నుంచి, మహిళలు, గర్భిణీలు తినే ఆహారాన్ని కల్తీ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. వారం రోజుల నిల్వ ఉంచిన ఫుడ్, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన మాంసపు పదార్థాలతో వంటకాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాల విక్రయాన్ని గుర్తించారు. నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్స్‌లో మహా దారుణాన్ని చూశారు. ఆహార భద్రత, ప్రమాణాల శాఖ దాడుల్లో అనేక అంశాలను గుర్తించారు. మూడు నుంచి ఐదు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు చూసి అధికారులు షాక్ అయ్యారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు అన్నీ నిల్వ ఉంచినవేనని గుర్తించారు.. 42 నమూనాలు సేకరించారు.. పలు హోటల్స్ రెస్టారెంట్స్ దాబాలు లో సుమారు 150 కేజీల కుళ్ళిన చికెన్ గుర్తించారు.
మంత్రి కొండా సురేఖకు షాక్.. క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం
హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖపై కీలక తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకోబడగా, BNSS సెక్షన్ 222 r/w 223 ప్రకారం నేరాన్ని స్వీకరించాలని కోర్టు నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని భావించింది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల సమర్పించిన వాదనలను కోర్టు సమర్థించింది. సాక్ష్యులు (PW1 నుండి PW5) ఇచ్చిన వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన తర్వాత, సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు గుర్తించింది.
భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. త్రుటిలో తప్పించుకున్న మహిళలు..
మనకు బ్రతికే అదృష్టం ఉంటే.. ఎంతటి ప్రమాదం వచ్చినా ఏమి కాదు. చిన్న గాయం కూడా కాకుండా బ్రతికి బయటపడతాం. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. కొన్ని ప్రమాదాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉంటాయి. ఏదో యముడు సెలవుకు వెళ్లినట్లుగా కొంతమంది ఆ ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటారు. అలాంటి ఘటనే తాజాగా కుప్పంలో చోటు చేసుకుంది. కుప్పం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఫ్రీ ఫైర్లో రూ.2,800 నష్టపోయిన 13 ఏళ్ల బాలుడు.. తల్లిదండ్రులు తిడతారని చివరకు?
ఫ్రీ ఫైర్ కారణంగా మరో ప్రాణం బాలి అయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల ఆక్లాన్ జైన్ అనే ఏడవ తరగతి విద్యార్థి, ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ ఆడుతూ రూ.2,800 పోగొట్టుకున్న తర్వాత, తల్లిదండ్రులు కొడతారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం రాత్రి ఇండోర్ నగరంలోని అనురాగ్ నగర్ లో చోటుచేసుకుంది. ఆక్లాన్ జైన్ అనే బాలుడు, ఇంట్లో ఉన్న సమయంలో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ.. తన తల్లి డెబిట్ కార్డ్‌ను గేమ్ IDకి లింక్ చేసి రూ.2,800 ఖర్చు చేశాడు. ఆ విషయాన్ని తన తల్లికి తెలిపిన తరువాత.. వారేమంటారో అనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
షేక్ హసీనా పారిపోయిన రోజు, బంగ్లాదేశ్‌లో సంస్కరణల జాబితా..
గతేడాది ఆగస్టు 05న షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, బంగ్లాదేశ్ నుంచి ఇండియా పారిపోయి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఆమె దేశాన్ని వదలాల్సి వచ్చింది. ఆ తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, షేక్ హసీనా దేశాన్ని వదిలిన ఆగస్టు 5న ‘‘విప్లవ వార్షికోత్సవం’’గా జరుపుకోబోతోంది. హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రోజే, ప్రజాస్వామ్య సవరణల జాబితాను విడుదల చేస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం శనివారం తెలిపింది.
ఐదవ టెస్ట్‌కు రోహిత్ శర్మ.. వీడియో వైరల్!
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్ట్‌కు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యాడు. మూడో రోజైన శనివారం ఆటను చూసేందుకు రోహిత్ ఓవల్ మైదానానికి వచ్చాడు. ఈరోజు ఆట ఆరంభమైన గంట తర్వాత హిట్‌మ్యాన్ స్టేడియంలోకి వచ్చాడు. వీఐపీ గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు టీ20 క్రికెట్‌కు సైతం వీడ్కలు చెప్పాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2025 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ పేలవ ప్రదర్శన చేశాడు. గత రెండేళ్లుగా టెస్ట్‌ల్లో రోహిత్ పెద్దగా రన్స్ చేయలేదు. దాంతో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఒత్తిడి చేసిందని, అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడని నెట్టింట వార్తలు వచ్చాయి. రోహిత్ రిటైర్మెంట్ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర కీలకం అని న్యూస్ వినిపిస్తున్నాయి.
వైసీపీ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబుకు జగన్ ఫోన్.. ఎందుకంటే..?
వైసీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఘటన వివరాలు తెలుసుకున్నారు. సాగునీటి కాలువలు గుర్రపు డెక్కతో నిండిపోయి పంటపొలాలకు నీరు రావడం లేదంటూ రైతుల కష్టాలపై రేపల్లెలో నిరసన వైసీపీ కార్యకర్తల నిరసనలో వేమూరు నియోజకవర్గ ఇంఛార్జ్ వరికూటి అశోక్‌బాబుపై పోలీసుల దాడిని జగన్ ఖండించారు. వేలాది మంది రైతుల తరుపున పోరాడుతూ.. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్‌బాబు చేస్తున్న ప్రయత్నాన్ని అణిచివేయాలని చూడడం దారుణమన్నారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం చేయడం అభినందనీయమని అశోక్‌బాబును ప్రసంసించారు. అశోక్‌బాబు ఆరోగ్య వివరాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైన పూర్తి సహాయసహకారాలు పార్టీ నుంచి అందుతాయని జగన్ భరోసా ఇచ్చారు..
కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తోందా..? మహేష్ గౌడ్ చెప్పిన నిజం..!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా తప్పుబట్టారు. “కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ స్పష్టంగా చెప్పింది – కేసీఆర్ దోషి. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు,” అని ఆరోపించారు. ఇంజనీర్లు సూచించిన సాంకేతిక అంశాలను పక్కన పెట్టి, తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నాడని విమర్శించారు. “తనకు ఇష్టం ఉన్న చోటే ప్రాజెక్టు కట్టాలని ఆదేశాలు ఇచ్చాడు. ఇప్పుడు రెండే పిల్లర్లు కుంగాయని అంటున్నారు… ఇది చిన్న విషయం కాదు,” అని అన్నారు.
మద్యం కేసులో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుపై కోర్టు కీలక ఆదేశాలు..
మద్యం కేసులో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్స్ కాపీని మాచవరం ఎస్.బిఐ బ్యాంకు అధికారులకు అందజేసిన కోర్టు సిబ్బంది. రూ.11 కోట్ల నగదు విషయంలో కోర్టు ఆదేశాలను పాటించాలని బ్యాంకు అధికారులను కెసిరెడ్డి న్యాయవాదులు కోరారు. గత నెల 30వ తేదీన సిట్ రూ. 11 కోట్ల నగదు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ నగదును రాజ్ కెసిరెడ్డికి చెందినదేనంటూ సిట్ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేసినట్లు రాజ్ కెసిరెడ్డి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు కొన్ని సందేహాలు ఉండటంతో కోర్టులో తాము కూడా మెమో దాఖలు చేశామన్నారు. “కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఆ నగదును విడిగా ఉంచాలని కోరాం. మేం పిటిషన్ వేసినట్లు తెలుసుకుని సిట్ అధికారులు హడావిడిగా మెమో దాఖలు చేశారు. మేం దాఖలు చేసిన మెమో పై కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. రూ. 11 కోట్ల నగదుకు పంచనామా జరిపించాలని ఆదేశాలిచ్చింది. మిగిలిన నగదుతో ఆ 11 కోట్లను కలపొద్దని ఆదేశాలిచ్చింది.
ఈ కేసులు, కొట్లాటలు నాకు కొత్త కాదు.. నా జీవితమే ఒక పోరాటం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. “నా కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని స్పష్టం చేసింది.” “నాకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉంది. ఈ కేసులు, కొట్లాటలు నాకు కొత్త కాదు. నా జీవితమే ఒక పోరాటం.” అని ఆమె అన్నారు.