‘బలహీనమైన ఆటగాడు’ అన్న కార్ల్‌సెన్.. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ లో ఓడించిన గుకేష్
మాగ్నస్ కార్ల్‌సెన్ తన బహిరంగ మాటలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ ఆరో రౌండ్‌లో డి గుకేష్ అతన్ని ఓడించాడు. క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్‌లో గురువారం డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్ నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించి షాకిచ్చాడు. మొదటి రోజు తర్వాత సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచిన భారత ఆటగాడు, ప్రపంచ నంబర్ 1ని ఓడించి ఇప్పుడు 10 పాయింట్లతో ముందుకు సాగాడు. టోర్నమెంట్‌లోని నాల్గవ, ఐదవ రౌండ్లలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నోడిర్‌బెక్ అబ్దుసత్టోరోవ్, అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాను ఓడించి కార్ల్‌సెన్‌తో తలపడ్డాడు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు లారీలు.. ముగ్గురు మృతి
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి ముగ్గురు సంజీవ దహనమయ్యారు. ఖమ్మం – వరంగల్ మధ్య జాతీయ రహదారిపై రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా క్యాబిన్‌లో మంటలు చేలరేగి ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ సజీవ దహనం అయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళలకే! ఆ దిశగా అధిష్టానం అడుగులు
ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నారీమణులను వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జేపీ నడ్డా వారసుడిగా తొలిసారి మహిళా అధ్యక్షురాలు అవ్వొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కమలం పార్టీలో ఇది చారిత్రాత్మక విషయమే అవుతుంది. త్వరలోనే ఉత్కంఠకు ఫుల్‌స్టాప్ పడనుంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని అధ్యక్ష పదవి వరించనుంది.
తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన రష్యా.. ఆఫ్ఘన్ రాయబారిని అంగీకరిస్తూ ప్రకటన
రష్యా ఒక చారిత్రాత్మక అడుగు వేసి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోవడంతో ఈ చర్య ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాలిబన్లు నియమించిన కొత్త ఆఫ్ఘన్ రాయబారి గుల్ హసన్ హసన్‌ను అంగీకరిస్తూ రష్యా ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది. దీనితో, తాలిబన్ పాలనను అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ అధికారంలోకి వచ్చింది. “ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి అధికారిక గుర్తింపు లభించడం వల్ల మన దేశాల మధ్య వివిధ రంగాలలో నిర్మాణాత్మక ద్వైపాక్షిక సహకారం పెరుగుతుందని మేము విశ్వసిస్తున్నాము” అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో మాస్కోలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గుల్ హసన్ హసన్‌ను కలిసి ఆయన ఆధారాలను స్వీకరించారు.
యూనివర్సిటీ నిర్వాకం.. 100కి 257.. 30కి 225 మార్కులు.. విద్యార్థులు లబోదిబో
విశ్వవిద్యాలయాలు.. ఆ పేరుకు తగ్గట్టుగానే ఉండాలి. యూనివర్సిటీలు తమ ఔనత్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ గొప్ప పేరు సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే విశ్వవిద్యాలయాల మీద నమ్మకం కలుగుతుంది. లేదంటే విద్యార్థుల దృష్టిలోనూ.. విద్యావ్యవస్థలోనూ చెడ్డపేరు మూటగట్టుకోవల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో భీమ్‌రావు అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. యూనివర్శిటీ నిర్వాకంతో విద్యార్థులు, విద్యావేత్తలంతా నోరెళ్లబెడుతున్నారు. ముజఫర్‌పూర్‌లో ఉన్న భీమ్ రావు అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన పరీక్షల్లో వింత వింత సంఘటనలు చోటుచేసుకున్నాయి. 100 మార్కుల పరీక్షలో 257 మార్కులు, ఇక 30 మార్కుల ప్రాక్టీకల్ పరీక్షల్లో 225 మార్కులు వేశారు. ఇలా చాలా మందికి ఎక్కువ మార్కులు పడడంతో విద్యార్థులంతా అవాక్కయ్యారు. ఇదేం విడ్డూరం అంటూ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. ఇంకో విచిత్రమేంటంటే.. బాగా చదవి.. అన్ని పరీక్షలకు హాజరైన విద్యార్థులు మాత్రం ఫెయిలైపోయారు. ఇక వీళ్ల గోడు వర్ణణాతీతం.
వ్యవసాయ కూలీకి దొరికిన విలువైన వజ్రం.. క్యూ కట్టిన వ్యాపారులు! ధర తెలిస్తే షాకే
తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది. కొన్ని రోజులుగా జనం, రైతులు తమ అదృష్టంను పరీక్షించుకునేందుకు వజ్రాల వేట కోసం పొలాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కొందరికి విలువైన వజ్రాలు దొరికాయి. ఇప్పటికే తుగ్గలి మండలంలో మదనంతపురం, జొన్నగిరిలో విలువైన వజ్రాలు లభించగా.. తాజాగా పెండకల్ గ్రామంలో ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభ్యమైంది.
12 గంటల్లో 1,113 మంది పురుషులతో సె*క్స్ చేసిన మహిళ
విదేశాల్లో కొంతమంది సెలబ్రిటీలకు సంచలనాలతో పేరు సంపాదించడం ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా ఒన్లీఫ్యాన్స్ మోడల్స్ వినూత్న రీతిలో రికార్డులు నెలకొల్పుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా 23ఏళ్ల లిలీ ఫిలిప్స్ అనే యువతి, అత్యధిక పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకుని ప్రపంచ రికార్డు నమోదు చేసినట్లు ప్రకటించడంతో నెట్టింట కలకలం రేగింది.
లిలీ ఫిలిప్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో, “నేను ఒక ప్రపంచ రికార్డు సృష్టించాను. 12 గంటల వ్యవధిలో మొత్తం 1,113 మంది పురుషులతో సె*క్స్ చేశాను. ఇది నా జీవితంలో చాలా గర్వకారణం. దయచేసి నన్ను బేస్ చేసి మద్దతు ఇవ్వండి,” అంటూ పేర్కొంది. అంతేకాదు, తన వీడియోలు చూడాలంటే మెంబర్‌షిప్ చెల్లించాలంటూ తన ఫాలోవర్లను కోరింది.