KCR National Party: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తున్న వేళ సంబురాలకు గ్రేటర్ టీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. డివిజన్, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పటాకుల పేలుళ్లు, డప్పు వాయిద్యాలు, కలర్‌ఫుల్ వాతావరణంలో వేడుక నిర్వహించేలా ఏర్పాట్లు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందే ఘట్టానికి సమయం ఆసన్న మైంది. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో తెరాస సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. 8 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న టిఆర్ఎస్ ఇప్పుడు జాతీయ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వబోతుంది. కొత్త జాతీయ పార్టీ.. జాతికి అనివార్యం అనే నినాదంతో టిఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి (BRS) గా మారుస్తూ కొత్త పార్టీ ఎజెండాను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నేడు మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీపై ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దాదాపు అరగంట పాటు గులాబీ సైన్యం ఎక్కడివారక్కడ పెద్ద ఎత్తున సంబురాలు చేయాలని నిర్ణయించారు.
2001తెలంగాణ ఆత్మగౌరవం స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ఆవిర్భవించింది.అయితే ఇప్పుడు దేశహితం కోసం పడికిలి బిగిస్తున్నారు కేసీఆర్.. కాగా, అప్పుడూ ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. అయితే..నాడు ప్రధానిగా బీజేపీ అగ్రనేత వాజ్‌పేయి ఉండగా.. నేడు ప్రధానిగా మోడీ ఉన్నారు. కాగా, 2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ రాజకీయ బలంలేదు.కానీ ఇప్పుడు తెలంగాణ సాధించి అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలిపారు. నేడు జాతిహితం కోసం తెలంగాణే మాడల్గా తెలంగాణే స్పూర్తిగా విజయదశమి పర్వదినం నాడు శంఖారావం చేస్తున్నారు. ఇక డిసెంబరు 9న దిల్లీలో భారీ బహిరంగ సభ ద్వారా బలప్రదర్శన చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
ఈనేపథ్యంలో.. ప్రధానంగా తెలంగాణ భవన్‌లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇక.. తెలంగాణ భవన్‌తో పాటు బంజారాహిల్స్ రోడ్ నం.14.. మరికొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్‌ఎస్ పేరిట ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. తలసాని సాయి కిరణ్‌యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సాంస్కృతిక కార్యక్రమాలు.. హైడ్రాలిక్ పద్ధతిలో జాతీయ పార్టీ లోగో ప్రదర్శన.. త్రీడీ వాల్ ప్రదర్శన ఆకట్టుకోనున్నది. ఈ కార్యక్రమానికి కర్ణాటక నుంచి జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి, ఆపార్టీ ఎమ్మెల్యేలు నగరానికి చేరుకున్నారు. తమిళనాడు నుంచి విఎస్‌కే వ్యవస్థాపక అద్యక్షుడు చిదంబరం ఎంపీ తిరుమావళవన్, ద్రావిడ దేశం వ్యవస్థాపక అద్యక్షుడు కృష్ణారావు. జాతీయ రైతు సంఘం ప్రతినిధులు భాగ్యనగరానికి చేరుకున్నారు.
Team India: టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా స్థానంలో ఎవరు? రోహిత్ ఏమంటున్నాడు?