Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 30న ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేగం పెంచాయి. అధికార బీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గాల వారీగా పర్యటనలు నిర్వహిస్తున్నాయి. తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపుతున్నారు. హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు యుద్ధం నడుస్తోంది. మరోవైపు బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో పర్యటిస్తోంది. ఈనేపథ్యంలో.. ఇవాల రాష్ట్రానికి బీజేపీ ముఖ్య నేతలు రానున్నారు. జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, పియూష్ గోయల్ తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.
బీజేపీ నేతల ప్రచార షెడ్యూల్..
నిజామాబాద్, సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారంలొ భాగంగా.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పటించనున్నారు. నిజామాబాద్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ అసెంబ్లీ మధ్యాహ్నం మూడు గంటలకు సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేపట్టనున్నారు. ఇవాళ రాష్ట్రానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ రానున్నారు. ఖైరతాబాద్ సెగ్మెంట్ లో ప్రమోద్ సావంత్ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోవా ముఖ్యమంత్రి పాదయాత్ర చేయనున్నారు. నేడు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు సిరిసిల్లలో జరిగే పబ్లిక్ మీటింగ్ లో స్మృతి ఇరానీ ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐదు గంటల వరకు మహిళా సమ్మేళనంలో స్మృతి ఇరానీ పాల్గొంటారు. ఇవాళ స్టేషన్ ఘనపూర్ వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘనపూర్, 4 గంటలకు వర్ధన్నపేటలో అర్జున్ ముండా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రామకోటిలో బిజెపి కార్యకర్తల ఇంటల్ లెక్చువల్ సమావేశంలో పియూష్ గోయల్ పాల్గొంటారు. నేడు కొత్త గూడెం,సూర్యాపేట, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగే బీజేపీ పబ్లిక్ మీటింగ్ లో జనసెన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
Revanth Reddy: నేడు కరీంనరగ్, సిద్దిపేటలో రేవంత్ పర్యటన..