Revanth Reddy: నేడు కరీంనగర్, సిద్దిపేటలో రేవంత్ పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: నేడు ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మానకొండూర్, మహేశ్వరం, ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సభల్లో రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు దుబ్బాక, మ. 12.30కి హుజూరాబాద్, 2 గంటలకు మానకొండూర్ బహిరంగ సభల్లో, 3 గంటలకు మహేశ్వరం, 4 గంటలకు ఎల్బీ నగర్, 5 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా దుబ్బాకలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లా మానకొండుర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్ననున్నారు. రేణికుంట టోల్ గేట్ ప్రక్కన భారీ బహిరంగ సభకు పూర్తీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నిన్న పర్యటించారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే… మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచాడని ఆరోపించారు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండని విమర్శించారు. ముంపు బాధితుల పక్షాన ఆనాడు ఏటిగడ్డ కిష్టాపూర్ లో తాను దీక్ష చేశానని తెలిపారు. కేసీఆర్ ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే.. కామారెడ్డికి పారిపోయిండని రేవంత్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డికే కాదు.. కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు కేసీఆర్ ను ఓడించి తీరతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుండే.. ఇయ్యాల ఎర్రవల్లిలో ఎట్లుండు అని ప్రశ్నించారు. రైతుల మేలుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకుపోయేందుకే ప్రాధాన్యతనిచ్చిండని తెలిపారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్… ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ.4500లకు అమ్ముకుండని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించాలి.. పొలిమేరలకు తరమాలని ఈ సందర్భంగా అక్కడి జనాలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకొనివ్వం.. ముమ్మాటికీ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బక్కోడు కాదు… లక్షకోట్లు మింగి, పదివేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు అని విమర్శించారు. తాను ఇక్కడికి వస్తున్నానని కేసీఆర్ కొడంగల్ పోయిండని అన్నారు. నా నోరు తెరిస్తే కంపు అని కొడంగల్ లో కేసీఆర్ అంటుండు.. ఇద్దరం పోదాం… డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకుందామని తెలిపారు. ఎవరి నోట్లో కంపు ఉందో తేలుద్దాం… పొద్దున లేస్తే ఎత్తుడు పోసుడే నీ పని.. నీతో నాకు పోలికా? అని కేసీఆర్ పై మండిపడ్డారు.
Odisha: ఒడిశాలో దారుణం.. సిట్ అప్లు చేయించిన టీచర్.. చనిపోయిన చిన్నారి
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!