Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఆరో అంతస్తులో కార్మికులు సెంట్రింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే అకస్మాత్తుగా ఒక్కసారిగా ఐదో అంతస్తులోని భవనం గోడ కూలిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకోనేలోపే అనుకున్నదంతా జరిగిపోయింది. దానిపై నిర్మించిన సెంట్రింగ్ కర్రలు విరిగిపోవడంతో ఒక్కసారిగా నలుగురు కార్మికులు కింద పడిపోయారు. వారిపై బలంగా సెంట్రింగ్ కర్రలు బలంగా పడటంతో నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Read also; G20: జీ20 సదస్సు .. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.1000
మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శబ్దం రావడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పక్కనే బిల్డిండ్ గోడ కూలిపోయి కూలీలు చనిపోవడంతో చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణంలో లోపాలు ఉన్నా.. ఇంటి యజమాని నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే మృతి చెందిన కూలీల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో అద్దరగుట్ట ప్రాంతం విషాదంగా మారింది. ఈ ప్రమాదంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా ఈ గోడ కూలిందా? లేక వాస్తు దోషమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read also;Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ ఏమన్నారంటే..
నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గోవా కర్రలు నాణ్యత లేకపోవడం వల్లనే ఉదయం సమయంలో పని చేస్తుండగా ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నామన్నారు. తన పరిస్థితీ విషమంగా ఉన్నదని అన్నారు. ఓనర్స్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఓనర్స్ దాసరి సంతోష్, శ్రీరామ్ లుగా గుర్తించారు. బిల్డింగ్ ని శ్రీనివాస్ నాయుడుకి డెవలప్మెంట్ కి ఇచ్చినట్లు సమాచారం. డిసెంబర్ 2, 2022లో భవన నిర్మాణ అనుమతులు తీసుకున్నారు. జిహెచ్ఎంసి జీ+5కి పర్మిషన్స్ ఇచ్చింది. అయితే యజమానులు మాత్రం జీ+7 నిర్మాణం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 7వ అంతస్తులో పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. యజమాని, బిల్డర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓనర్, బిల్డర్ పై కేసు నమోదు చేసి వెంటనే పట్టుకుంటామని తెలిపారు.
G20: జీ20 సదస్సు .. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.1000