ఇండోర్‌లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. ట్రక్కును జనాలపైకి దూసుకుపోనిచ్చాడు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాద స్థలిలో ఆర్తనాదాలు మిన్నంటాయి.
పల్నాడు జిల్లా శావల్యపురం మండలం కనుమర్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లే ల్యాండ్ వ్యాన్, ఆటోఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న రూరల్ సిఐ ప్రభాకర్ రావు పరిస్థితిని సమీక్షించారు. మృతులంతా శావల్యాపురం మండలం కారుమంచి వాసులుగా గుర్తించారు. మృతులు బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ,…
అన్నమయ్య జిల్లాలోని పీలేరు సదుం రోడ్డులో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటనలో కర్ణాటక కు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లి పడడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. స్థానికులు కారును బావిలోంచి బయటకు తీశారు. మృతులు ఎవరన్నది తెలియ…
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రాజానగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు.. ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులోని ప్రయాణికులు కర్నూల్ నుంచి తిరుపతికి రిసెప్షన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు
Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు మృతి చెందారు.
కరీంనగర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో సోమవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు, బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి ముగ్గురు మృతి చెందారు.
రాష్ట్రంలో పలు చోట్ల ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన లారీ కారును ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర…