Gold Thieves: అక్కడ భక్తికథ కార్యక్రమం జరుగుతుంది. అందరూ భక్తులు హాజరయ్యారు. ఆభక్తికథలో మునిగిపోయారు. ఆకథవింటూ భక్తిపారవశ్యంతో వున్నవారే టార్గెట్ గా భక్తి నటిస్తూ మరికొందరు కిలాడీలు అక్కడకు వచ్చి దొంగతనాలకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్టేషన్ మైదానంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ మైదానంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు గోషామాల్ పోలీస్ మైదానంలో శ్రీ భగవత్ కథ కార్యక్రమం జరుగుతుంది..ఈ కార్యక్రమాని తిలకించడానికి వందలాది మంది మహిళలు హాజరై భగవత్ కథను వింటున్నారు. ఆకథ వింటూ భక్తి పారవశ్యంతో వున్న మహిళల వద్దకు వచ్చికూర్చున్న మరో మహిళ ఆమె మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసుని దొంగలించి పారిపోతున్న మహిళ దొంగతో పాటు మరి కొంతమంది మహిళలను అక్కడున్న ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Read also: Worlds Shortest Man: ప్రపంచంలోనే పొట్టి మనిషి.. అతడి హైట్ ఎంతో తెలుసా
గోషామాల్ పోలీస్ మైదానంలో శ్రీ భగవత్ కథ కార్యక్రమాని తిలకించడానికి వందలాది మంది మహిళలు హాజరై భగవత్ కథను వింటున్నారు. ఆ సమయంలో మాంగర్ బస్తికు చెందిన 8 మంది మహిళలు భగవత్ కథ కార్యక్రమంలో భక్తుల వలె వారి వద్ద కూర్చున్నారు. అదును చూసి ఓ మహిళా మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును దొంగలించారని పోలీసులు తెలిపారు. అదేగాక వీరితో పాటు మరి కొంతమంది వచ్చిన మహిళలు కూడా దొంగలించేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న భక్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారని పోలీసులు పేర్కొన్నారు. వారిచ్చిన ఫిర్యాదుతో షాహీనాయత్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న మహిళలు గతంలో పాత నేరస్తులేనని వెల్లడించారు.
Friday Bhakthi Tv Live: కాలభైరవాష్టమి సందర్భంగా ఈ పూజ చేస్తే…