Jeans : జీన్స్ ప్యాంట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు. అనేక బ్రాండెడ్ జీన్సులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి చావు దగ్గరపడ్డ ముసలోళ్లదాకా జీన్స్ వేయని వారు చాలా అరుదు. జీవితంలో ఒక్క సారైనా జీన్స్ వేసే ఉంటారు. అలాంటి జీన్స్ ప్యాంట్లు బరువుగా ఉంటాయి. ఉతికితే తొందరగా ఆరిపోవు. అందుకే జీన్స్ ప్యాంట్లను ఒకటి రెండు సార్లు వేసుకున్నాకే ఉతుకుతాం. కానీ ఓ మహిళ 18ఏళ్లుగా ఉతకకుండానే వేస్కుంటుందట. వామ్మో ఆ గబ్బును పక్కన వాళ్లు ఎలా భరిస్తున్నారో అని ఆలోచిస్తున్నారా.. నిజమండి బాబు. 18 సంవత్సరాలుగా ఒకే జీన్స్ ధరిస్తోందంట. దానిని ఆమె కొన్న తర్వాత ఒక్కసారి కూడా ఉతకలేదట. దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఆ జీన్స్ పై కనీసం ఒక్క మరకగానీ, దుమ్ము కానీ ఏమీ లేవట. తాను కొన్నప్పుడు కొత్తలో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందంట. ఈమె మన దగ్గర ఆమె కాదండోయ్ లండన్ మహిళ.
Read Also: Supreme Court: ఏపీ సర్కార్‌కు ఊరట.. సిట్‌పై హైకోర్టు స్టే కొట్టివేత..
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్ యార్క్ షైర్ కు చెందిన సాండ్రా విల్లిస్ అనే మహిళ 18ఏళ్ల కిందట షాపింగ్ కెళ్తి రెండు డెనిమ్ జీన్స్ కొనుక్కొచ్చిందంట. వాటిని ఆమె ఇప్పటి వరకు ఏడాదికోసారి మాత్రమే వేసుకుందట. అందుకే వాటిపై ఎలాంటి మరకలు పడలేదు. మరకలు పడనప్పుడు ఉతకడం ఎందుకు అని ఆమె వాటిని ఉతకటమే మానేసిందట. ఈ 18ఏళ్లలో ఆమె వాటిని ఒక్కసారి కూడా ఉతకలేదు. అవి కూడా ఇప్పటికీ ఫ్రెష్గా చాలా కొత్తగా కనిపిస్తుండటం విశేషం. మరో రెండేళ్ల పాటు కూడా ఉతకకుండా వాటిని వాడి రికార్డు క్రియేట్ చేయాలని మహిళ ఆలోచన. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది కాస్త వైరల్ గా మారింది. ఆమె చేసిన పనికి నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇంతకాలం జీన్స్ ఉతకకుండా ఎలా ధరించావు అని ఆమెను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఏడాదికోసారి వేసుకున్నా.. 18సార్లు వేసుకుని ఉంటావు. ఎందుకు ఉతకలేదని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు ఆమె స్పందించింది. తాను వాటిని ఉతకకపోయినా శుభ్రంగా తుడిచి పెడతానని చెప్పింది.
Read Also: Neera cafe: హైదరాబాద్‌కు మరో అదనపు ఆకర్షణ.. సాగర తీరంలో నీరా కేఫ్