విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపింది. మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు అకాడమీ ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయిందని వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, 2025 జూన్ మొదటి వారంలో పంపిణీ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది.
తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. విద్యార్థులు చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగా ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. ఇంటర్ ప్రధాన పరీక్షలు పూర్తి అయ్యాయని.. కానీ.. ఇంకా రెండు చిన్న పరీక్షలు మిగిలి ఉన్నాయిన్నారు. అవి 5 వేల లోపే విద్యార్థులు రాస్తారని ఆయన తెలిపారు. ఈ సారి…
తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 21 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20న తెలుగు మొదటి సంవత్సరం పరీక్ష, ఏప్రిల్ 22 మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష జరగనున్నాయి. ఏప్రిల్ 25…
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలకు సంబంధించి విద్యార్థులలో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డును ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. ఏప్రిల్ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయొచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జలీల్ తెలిపారు. అనుమానం ఉంటే…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని… ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఫెయిల్ చేశారని ట్విట్టర్‌లో ఆరోపించాడు. తన సూసైడ్‌కు మంత్రులు కేటీఆర్, సబితలే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. దీంతో క్షణాల్లోనే ఇంటర్ విద్యార్థి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. Read…
స్పాట్ వాల్యుయేషన్ కి స్టాఫ్ ని పంపించని కళాశాలల పై చర్యలు తప్పవని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తమ సిబ్బంది ని పంపించలేదని, పంపించాలని ఆదేశించినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. రిపోర్ట్ చేయని సిబ్బందికి, ప్రైవేట్ కళాశాలలకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. రేపు ఉదయం వరకు సిబ్బందిని రిలీవ్ చేయకున్న, సిబ్బంది రిపోర్ట్ చేయకపోయిన క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.…
తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు అంతా సిద్ధం అయింది. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ప్రయోగాత్మకంగా మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సెంటర్ల వద్ద ప్రతి…
కళాశాలలను తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ఈ కరోనా సమయంలో పర్మిషన్ లేకున్నా కొన్ని కళాశాలలు ఇంటర్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. అనుమతి లేని బిల్డింగ్స్ లో కళాశాలలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫీజులు ఇస్టమొచ్చినట్టు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ కళాశాలలు అడ్మిషన్స్, ఫీ విషయం లో బోర్డ్ ఆదేశాలను పాటించాలి అని తెలిపింది. పిజికల్ తరగతులు నిర్వహించకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు ఉంటాయి. అలాగే అనుబంధ గుర్తింపు రద్దు చేస్తాం అని పేర్కొంది. ఈ మేరకు ఓ…