Daughter harsh: మానవత్వం మంటగలిసిపోతుంది. రోజురోజుకూ మానవ బంధాలు, అనుబంధాలు విలువ లేకుండా పోతోంది. ఆస్తి, డబ్బు ఉంటే చాలు కుటుంబాన్ని కడతేర్చడానికి కూడా వెనకడాటం లేదు. చిన్నప్పటి నుంచి కని పెంచిన తల్లిదండ్రులను సైతం చంపేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఆస్తికోసం అల్లారు ముద్దుగా పెంచిన కన్నబిడ్డలే తల్లిదండ్రులపై కర్కసత్వాన్ని చూపుతున్నారు. వారిని చంపేస్తే వారి ఆస్థి తన సొంతం అవుతుందనే దురాశ కల్లు మూసుకుపోయేలా చేస్తుంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు.. వారిపాలిట యమపాశాలుగా మారుతున్నారు. ఆస్తులు పంచివ్వకపోతే.. తల్లిదండ్రులను సైతం మట్టుబెట్టేందుకు వెనకాడటం లేదు. తండ్రి ఆస్థి కోసం ఓ కూతరు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో జరిగింది.
Read also: MLA Purchase Case: అప్పటి వరకు రికార్డులు సీబీఐకి ఇవ్వాల్సిన పనిలేదు..! సుప్రీంకోర్టు ఆదేశాలు
ఆంజనేయులు అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా రాజంపేటలో నివాసం ఉంటున్నాడు. అతనికి ఒక కూతరు ఉంది. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. అయితే కూతురికి ఆస్తి ఇచ్చేందుకు తండ్రి ససేమిరా అన్నాడు. తన ప్రాణం పోయినా సరే ఆస్తి ఇవ్వనని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో తండ్రి పై కోపం పెంచుకున్న కన్న కూతురు తండ్రిని చంపేందుకు ప్లాన్ వేసింది. తండ్రిని చంపి ఎలాగైనా తన ఆస్తి కొట్టేయాలనుకుంది. అలా చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని అనుకుందో ఏమో గానీ .. తండ్రి ఒక్కడే ఇంట్లో ఉండడాన్ని గమనించింది అయితే తండ్రి బయటకు రాకుండా ఇంటికి తాళం వేసింది. బయటకు వచ్చిన కూతురు ఇంటికి నిప్పు పెట్టింది. అంతే తండ్రి కాపాడండి అని అరుస్తున్నా కనికరం లేకుండా చూస్తూ ఆనంద పడింది కూతురు. అయితే అరుపులతో తండ్రి నిప్పుల్లో కాలి పోయి చివరకు ప్రాణాలు వదిలాడు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Driver Salary: నెలకి రూ.2 లక్షలు. ఎవరి డ్రైవర్‌కి? ఎప్పుడు? ఏంటా కథ?