మాస్ సినిమాల యందు బోయపాటి మాస్ వేరు.. అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ స్కంద సినిమాను మరింత ఊరమాస్‌గా తెరకెక్కించాడు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను టచ్ చేస్తూ.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో మాస్ జాతర చేయించాడు బోయపాటి. కాకపోతే.. కాస్త రియాల్టీకి దూరంగా, లాజిక్ లెస్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు. అయినా కూడా రామ్ ఊచకోతకు బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేచిపోయింది. ప్రస్తుతం థియేటర్లో స్కంద మాత్రమే బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. కాబట్టి.. భారీగానే కలెక్షన్లు వస్తున్నాయి. డే వన్ 18 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన స్కంద.. ఐదు రోజుల్లో యాభై కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమాకు.. అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు హాలీడేస్ కలిసి రావడంతో.. వసూళ్లు బాగానే వచ్చాయి.
మొత్తంగా.. ఐదు రోజుల్లో 22 కోట్లకు పైగా షేర్.. 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ బరిలోకి దిగిన స్కంద.. మరో 24 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో ఇంకా సగం రావాల్సి ఉందన్న మాట. ఈ వీకెండ్ వరకు స్కంద హిట్ లిస్ట్‌లోకి చేరుతుందో లేదో తేలిపోనుంది. ఇదిలా ఉంటే.. స్కంద సినిమాలో బోయపాటి మాస్ డోస్ చాలా హెవీగా ఉంది. కానీ క్లైమాక్స్‌లో పార్ట్ 2 ప్రకటించాడు. దీంతో.. ఈ మాస్ మూవీకి సీక్వెల్ అవసరమా అనే చర్చ జరుగుతోంది. అయినా కూడా బోయపాటి స్కంద2 తెరకెక్కించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడట. ఖచ్చితంగా ఈ ఊరమాస్ బొమ్మకు పార్ట్2 రావడం గ్యారెంటీ అంటున్నారు. అయితే అఖండ2 తర్వాతే స్కంద2 వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఫైనల్‌గా స్కంద బాక్సాఫీస్ లెక్క ఎక్కడి వరకు ఆగుతుందో చూడాలి.