Illicit Relationship: ప్రియురాలిపై మోజు.. 22నెల చిన్నారిని నేలకేసి కొట్టిన ప్రియుడు
- సూర్యాపేట జిల్లాలో దారుణం
- అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని 22 నెలల చిన్నారి హత్య
- చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన ప్రియుడు అరవింద్ రెడ్డి
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illicit Relationship: అక్రమ సంబంధానికి 22 నెలల పసికందు అడ్డుగా ఉందని నేలకేసి కొట్టి చంపాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాఠాపూర్ గ్రామానికి చెందిన మౌత్క విజయ, సైల్ దంపతుల కుమార్తె రమ్య అలియాస్ నవ్యశ్రీకి అదే మండలం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె అరుణ్యకు 4 సంవత్సరాలు, రెండవ కుమార్తె మహాన్వికి 22 నెలలు. నవ్యశ్రీ అత్తగారు గ్రామానికి చెందిన బుల్లింక అరవింద్ రెడ్డితో ఏడు నెలల క్రితం అక్రమ సంబంధం పెట్టుకుంది. అరవింద్ రెడ్డి 20 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి వచ్చి నవ్యశ్రీతో పాటు తన ఇద్దరు పిల్లలను చూసుకుంటానని చెప్పి గది అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 11వ తేదీ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో 22 నెలల పాప నిద్రిస్తుండగా, నవ్యశ్రీ తన పెద్ద కూతురు అరుణ్యను తీసుకుని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో ఇంటికి వచ్చిన అరవింద్ రెడ్డి నిద్రిస్తున్న మహాన్విపై దారుణంగా దాడి చేసి కొట్టి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
నవ్య శ్రీ ఇంటికి తిరిగి వచ్చేసరికి, మహాన్వి తప్పిపోయింది. నవ్య శ్రీ షాక్ లో ఉండిపోయింది. నాగమణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసి రూరల్ సీఐ సురేందర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో మహాన్వి నుదిటిపై గాయమైంది. రెండు భుజాలకు చెంపలు, చేతులు, అరికాళ్లు, పిరుదులపై విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బలమైన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో అరవింద్ బాలికను హత్య చేసి పారిపోయాడని తేలడంతో పోలీసులు అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు అరవింద్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నవశ్రీతో అరవింద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, దీంతో అరవింద్ 22 నెలల మహాన్విపై కోపగించాడని విచారణలో తేలింది. దీంతో అక్రమ సంబంధాన్ని అడ్డుకోవాలనే కారణంతోనే మహాన్విని అరవింత్ విచక్షణారహితంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
Kuwait fire tragedy: భారతీయ కార్మికుల రక్షణకు మోడీ ఆదేశాలు..( వీడియో)
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!