Salman Khan: కాల్పుల ఘటనపై 150కి పైగా ప్రశ్నలు.. సల్మాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్న పోలీసులు!
- 150కి పైగా ప్రశ్నలు
- తూటాల శబ్దంతోనే నిద్రలేచా
- నా ప్రాణాలకు ముప్పు ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Crime Branch Recorded Salman Khan Statement: గత ఏప్రిల్ 14న బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాల్పుల ఘటనకు సంబంధించి తాజాగా సల్మాన్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు ఓ అధికారి వెల్లడించారు. కాల్పులు జరిగిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానని, తూటాల శబ్దంతోనే నిద్రలేచానని సల్మాన్ పోలీసులకు తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా చెప్పాడట.
కాల్పుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం జూన్ 4న క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లినట్లు ఓ అధికారి తెలిపారు. సల్మాన్‌తో పాటు అతడి సోదరుడు అర్బాజ్ ఖాన్ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేసుకున్నారు. సల్మాన్ వాంగ్మూలం తీసుకోవడానికి నాలుగు గంటలు, అర్బాజ్ స్టేట్‌మెంట్‌కు 2 గంటలకు పైగా సమయం పట్టినట్లు సదరు అధికారి తెలిపారు. ఇద్దరినీ కలిపి 150కి పైగా ప్రశ్నలు పోలీసులు అడిగారని చెప్పుకొచ్చారు. ‘కాల్పుల ఘటన జరిగిన రోజు నేను ఇంట్లోనే ఉన్నా. ముందురోజు రాత్రి పార్టీకి హాజరవ్వడంతో.. ఆలస్యంగా పడుకున్నా. తెల్లవారుజామున నా ఇంటి బాల్కనీ వద్ద తుపాకీ పేలిన శబ్దాలు వినిపించాయి. నెను ఉలిక్కిపడి నిద్రలేచా. బాల్కనీకి వెళ్లి చూడగా.. ఎవరూ కన్పించలేదు’ అని సల్మాన్ వాంగ్మూలం ఇచ్చారని ఆ అధికారి పేర్కొన్నారు.
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఏప్రిల్ 14న ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్నాయి. సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి.. నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. కాల్పుల అనంతరం దుండగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఇది గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పనేనని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న ఒకతను ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి.
తాజావార్తలు
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..