TSPSC: టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గ్రూప్ 2 అభ్యర్థులు ముట్టడించారు. గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట వేలాది మంది అభ్యర్థులు గుమిగూడారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్‌కు సమయం లేదని గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్, టీజేఎస్ మద్దతు పలుకుతున్నాయి. నిరసనలో కోదండరామ్, దయాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో విన్నవించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు అభ్యర్థులను పక్కకు పంపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇప్పటికే గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు ఈనెల 3 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూపులకు చదువుకునే సమయం లేదని వాపోయారు. అంతేకాదు, పలు పేపర్ లీకేజీలు జరిగినా అదే బోర్డుతో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
గ్రూప్ 2 పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ రంగంలోని వివిధ విభాగాల్లో 783 పోస్టుల భర్తీకి TSPCS గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. అయితే గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఈ నెలలోనే జరుగుతాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకే నెలలో మూడు ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయని, కష్టమని అంటున్నారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం ఓయూలో ఆందోళన జరిగింది. ఈరోజు వారు TSPSC వద్ద ఆందోళన ప్రారంభించారు. ఆయన TSPSC కార్యాలయంలో బైఠాయించారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
7/G Brundavan Colony : రీ రిలీజ్ కు సిద్దమైన కల్ట్ క్లాసిక్ మూవీ..?