TSPSC:: టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గ్రూప్ 2 అభ్యర్థులు ముట్టడించారు. గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు.