Atrocity on 4 year child: ఇటీవలి కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పసికందులను కూడా కామాంధులు కనికరం చూపటం లేదు. ఎందరో మృగాళ్లకు శిక్ష పడుతున్నా కనువిప్పు కావడం లేదు. ఇటీవల చిన్న పిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామ వాంఛ తీర్చుకునేందుకు చిన్నారులపై కూడా అత్యాచారం చేసేందుకు వెనుకాడటంలేదు. వారికి చాక్లెట్ ఆశ చూపించడం, వీడియోలను చూపించి వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. నోరు నొక్కి వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఏమీ తెలియని పసికందులపై ఇలాంటి దారుణాలు జరగకుండా అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కామాంధులు వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి ఘటనే భాగ్యనగరంలో చోటుచేసుకోవడం నగరవాసులు షాక్ కు గురయ్యారు. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ నీచుడు అఘాయిత్యానికి పాల్పడిన అమానుష ఘటన శంషాబాద్ వెలుగులోకి రావడంతో నగరంలో కలకలం రేపింది.
Read also: Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర
శంషాబాద్ ఫ్లై ఓవర్ లేబర్ క్యాంప్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరు బెంగళూరు నుంచి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి 4ఏళ్ల చిన్నారి వుంది. అయితే పనుల నిమిత్తం తల్లిదండ్రులు నిమిగ్నమై ఉండటం చిన్నారి బయట ఆడుకుంటు ఉండటం రోజు గమనించి స్థానికంగా వున్న ఓ యువకుడు ఆ చిన్నారిపై కన్నేశాడు. రోజు ఆ చిన్నారి ఒంటరిగా ఉండటాన్ని చూసి ఆ చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్లాన్ వేసుకున్నాడు. చిన్నారి తల్లిదండ్రులు పనుల్లో నిమిగ్నమై ఉండగా చిన్నారిని తీసుకెళ్లి అమానుషంగా అత్యాచారం చేశాడు. ఆచిన్నారి నొప్పికి విలవిల లాడటం గమనించిన స్థానికులు పాపను హుటాహుటిన నీలోఫర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావ్యం అయ్యిందని వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు తెలుపడంతో తల్లిదండ్రులు పాపను బతికించాలని వేడుకున్నారు. అయితే చిన్నారిని వెంటనే సర్జరీ చేశారు. సర్జరీ చేసినా పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వెంకటయ్యను వదిలే ప్రసక్తే లేదని వెంటనే అతన్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు పాపను బతికించాలని కన్నీరుమున్నీరు అవుతున్నారు. పాపపై అఘాయిత్యం చేసిన వెంకటయ్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు్న్నారు.
Bhatti Vikramarka : నేటి నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర