Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana VC Ravinder Gupta Stucks in Another Dispute in Nizamabad: నిజామాబాద్ జిల్లా లోని తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న గణేష్ నిమజ్జనం తర్వాత, గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి ఆయన నృత్యాలు చేశారు. అంతేకాదు గర్ల్స్ పై వీసీ డబ్బులు ఎగురవేస్తూ, డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకుండా వీసీతో పాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్టు సమాచారం. దీంతో వీసీ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసే రవీందర్ గుప్తా.. రెండు రోజుల క్రితం ఓ మహిళా ప్రొఫెసర్ ను దుర్భాషలాడి మరో వివాదానికి తెర తీశారు.
ఎదో ఒక వివాదంతో.. తెలంగాణ యూనివర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మారింది.. కొత్త వీసీ వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీలో నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. కాగా.. ఏడు నెలల కింద నియమించిన రిజిస్ట్రార్ ను తొలగించడంతో.. మరోసారి ఆ వర్సిటీ వార్తల్లోకి వెక్కింది.. అనేక ఆరోపణలు వస్తున్నా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అప్పట్లో విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో నిరుడు మే 22న యూనివర్సిటీలకు సర్కారు వైస్ ఛాన్సర్లను నియమించింది. ఈనేపథ్యంలో.. భాగంగా తెలంగాణ యూనివర్సిటీకి ప్రొఫెసర్ రవీంద్రకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.. ఏండ్లుగా ఇన్ చార్జి పాలనలో మగ్గిన తెలంగాణ వర్సిటీకి మంచిరోజులొచ్చాయని ఆశించిన ప్రొఫెసర్లు, స్టూడెంట్లకు నిరాశే మిగిలింది. అయితే.. వీసీ వచ్చినప్పటి నుంచి ఏదోఒక వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా వీసీ చుట్టే తిరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. అంతేకాకుండా.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియమాకం నుంచి రిజిస్ట్రార్ల తొలగింపు వరకూ ఏదో వివాదం జరుగుతూనే ఉంది. దీంతో.. వర్సిటీ అభివృద్ధిపై కాక వసూళ్లపైనే వీసీ దృష్టి పెట్టారనే ఆరోపణలూ వస్తున్నాయి. వీసీ తీరుపై ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో వేచి చూడాలి.
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
అయితే.. తెలంగాణా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. బాలికల వసతి గృహం ఎదుట విద్యార్థుల ధర్నా నిర్వహించారు. బాలికల వసతి గృహంలో వీసీ డాన్స్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేవారు. వీసీ దిష్టిబొమ్మను స్టూడెంట్స్ దగ్ధం చేసారు. వీసీని రీ కాల్ చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!