TS Tenth Exams 2024: పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాసే సమయం రానే వచ్చింది. రేపటి నుంచి టెన్త్ విద్యార్థులకు పరీక్షలు షురూ కానున్నాయి. అయితే విద్యార్థులు అధికారులు ఇచ్చిన గైడ్ లైన్స్ అనుసరించాలని సూచిస్తున్నారు. ఈ రూల్స్ విద్యార్థులు పాటించకపోతే డీబార్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 5నిమిషాల గ్రేస్ ట్రైం ను ప్రకటించిన విషయం తెలసిందే. అంతకు మించి పరీక్ష కేంద్రాలకు వచ్చిన వారికి అనుమతించమని ఇది విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి (మార్చి 18వ) ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్ లేకుండా రావచ్చని భావిస్తున్నారు.
టెన్గ్ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన గ్రేస్‌టైమ్ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు, సైన్స్ సబ్జెక్టులు మినహా మిగిలిన వాటికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు, పార్ట్-1 ఫిజికల్ సైన్స్, పార్ట్-2 బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు రోజులూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు సహా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
Read also: KTR-Harish Rao: కవితను కలిసేందుకు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు..
రూల్స్ పాటించకపోతే డిబార్..
పరీక్షల పర్యవేక్షణకు విద్యాశాఖ, రెవెన్యూ శాఖ నుంచి ఒక్కో అధికారి, ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించనున్నారు. ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగిలిన పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, సిబ్బంది పరీక్ష ముగిసిన తర్వాతే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు.
మధ్యలోనే బయటకు పంపించేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులకు తప్పుడు ప్రశ్నపత్రాలు జారీ చేస్తే ఇన్విజిలేటర్లను బాధ్యులను చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు, అభ్యంతరాలపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ నుంచి వివరణ కోరాలని ఇన్విజిలేటర్లను ఆదేశించారు. విద్యార్థులు కాకుండా, పరీక్షా సిబ్బంది ఎవరూ మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాలలోకి తీసుకెళ్లడం నిషేధించబడదు. విద్యార్థులు హాల్ టికెట్, ప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేల్ షార్పనర్, ఎరేజర్, జామెట్రీ పరికరాలను మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.
KTR-Harish Rao: కవితను కలిసేందుకు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు..