CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
- ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్
- సమస్యల పరిష్కారానికి రెండేళ్లు సమయం కోరిన సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy on Teachers Day 2026: విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల కంటే కూడా విద్యార్థులు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల వద్ద గడుపుతారని సీఎం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్న ఉపాధ్యాయులందరికీ సీఎం అభినందనలు తెలిపారు.
విద్యాభివృద్ధిలో తెలంగాణకు మెరుగైన స్థానం
విద్యాభివృద్ధిలో తెలంగాణ గతంలో 28వ స్థానంలో ఉండగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17వ స్థానానికి చేరుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పురోగతి ఉపాధ్యాయుల కృషి వల్లే సాధ్యమైందని అన్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 88 వేలు పెరిగిందని సీఎం పేర్కొన్నారు. ఈ విజయం ఉపాధ్యాయులదేనని, తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో 95 శాతం అడ్మిషన్లు జరిగాయని, సాంకేతిక విద్యలో తెలంగాణ వేగంగా ముందుకు వెళ్తోందని చెప్పారు.
Also Read
- Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
- Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
విద్య, ఉద్యోగాలు, ఉపాధిపై ప్రభుత్వ దృష్టి
సంక్షేమం, అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని సీఎం తెలిపారు. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది” అని పేర్కొన్న ఆయన.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సమర్థులైన వ్యక్తులను యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లుగా నియమించామని తెలిపారు.
“టీచర్లు రోడ్డుపైకి రావొద్దు”
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీచర్లు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డుపైకి రావాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. “ఉపాధ్యాయులు రోడ్డుపైకి రావొద్దు. వారి సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను” అని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 రోజుల్లో డీఎస్సీ ద్వారా 10,006 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, 25,950 మంది టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. అలాగే ఎలాంటి చిన్న వివాదం లేకుండా 34,706 మంది ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. 317 జీవో సమస్యను పరిష్కరించామని తెలిపారు.
విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. విద్యాశాఖ సమస్యలను పరిష్కరించేందుకు కే. కేశవరావును సలహాదారుగా నియమించామని చెప్పారు. రాష్ట్రానికి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
“రెండేళ్లు నాకు సమయం ఇవ్వండి”
ఉపాధ్యాయులు మరో రెండేళ్లు అంకితభావంతో విద్యార్థుల కోసం పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. “రెండేళ్లు నాకు సమయం ఇవ్వండి. ఆర్థిక వెసులుబాటును బట్టి మీ సమస్యలను పరిష్కరిస్తా” అని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు రోడ్డెక్కడం రాష్ట్రానికి శుభసూచకం కాదని పేర్కొన్న సీఎం.. రెండేళ్ల తర్వాత ఉపాధ్యాయులు ఆశించిన విధంగా సమస్యలను పరిష్కరించకపోతే ఎన్నికల సమయంలో తనకు ఎన్ని మార్కులు వేయాలో ఉపాధ్యాయులే నిర్ణయించుకోవచ్చని అన్నారు.
పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్లపై సీఎం వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై కూడా సీఎం పలు వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ ఇచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు పెండింగ్‌లో పెట్టారని ఆరోపించిన సీఎం.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం రూ.6 వేల కోట్లు చెల్లించిందని చెప్పారు. ఒకే కుటుంబం రాష్ట్రంపై భారీగా అప్పుల భారం మోపిందని విమర్శించారు.
ఉపాధ్యాయులను విదేశాలకు పంపించాం
విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు పంపించిన విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. “ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ ఖర్చులతో ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి విద్యా విధానాన్ని అధ్యయనం చేయించారా?” అని ప్రశ్నించిన సీఎం.. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించిందని తెలిపారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో 123 మంది టీచర్లకు అవార్డులు అందిస్తున్నామని చెప్పారు.
రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దు
ఉపాధ్యాయులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల విషయంలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఉపాధ్యాయులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి ట్రాప్‌లో పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.
“ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం”
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. పిల్లలకు మొదట ఎడ్యుకేషన్, ఆ తర్వాత స్కిల్స్, అనంతరం ఇన్నోవేషన్ వైపు తీసుకెళ్లాలని సూచించారు. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఇన్నోవేషన్‌కు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. గత పదేళ్లలో విద్యా వ్యవస్థ విధ్వంసానికి గురైందని విమర్శించిన సీఎం.. ఇప్పుడు దానిని వికాసం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు.
“దేశ విద్యావ్యవస్థకు తెలంగాణ దిక్సూచీ కావాలి”
తెలంగాణను దేశ విద్యావ్యవస్థకు దిక్సూచిగా తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో చేపడుతున్న మంచి కార్యక్రమాలపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. “పిల్లల భవిష్యత్తుకు ఏది మంచిదో చూడండి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది” అని ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు అందరూ పునరంకితం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!