Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అమరావతి రాజధానికి ఇలాంటి ప్రపంచస్థాయి సంస్థ రావడం గర్వకారణమన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోట్లాది కంటి చికిత్సలు అందించిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్.. అమరావతిలో మరింత విస్తృతంగా సేవలు అందించనుంది. 12 ఎకరాల విస్తీర్ణంలో.. ఏటా సుమారు 3 లక్షల మందికి చికిత్స అందించేలా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కంటి చికిత్సలతో పాటు.. పరిశోధన, శిక్షణ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న ప్రత్యేక ఐ అండ్ బ్రెయిన్ సెంటర్‌ను ప్రపంచస్థాయి నేత్ర వైద్య పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
పేదలకు కంటి వైద్యం అందించడంలో ఎల్వీ ప్రసాద్ సంస్థ చేస్తున్న సేవలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. నాలుగు రాష్ట్రాల్లో వందలాది కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్న సంస్థ.. డిజిటల్ హెల్త్ ఐ ప్రొఫైల్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందన్నారు. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా.. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. నోపోల్ సిటీ.. బ్లూ అండ్ గ్రీన్ సిటీ.. గ్రీన్ ఎనర్జీ.. కార్బన్ న్యూట్రల్ సిటీ.. డీప్‌టెక్ క్యాపిటల్‌గా అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ఇక టెక్నాలజీ రంగంలోనూ అమరావతికి ప్రత్యేక స్థానం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం, ఏఐ, ల్యాబొరేటరీ ఆటోమేషన్, ఎక్స్పెరిమెంటల్ బయాలజీ, క్వాంటం బయో వ్యాలీ వంటి రంగాల్లో పెట్టుబడులు, సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థల భాగస్వామ్యంతో 133 క్యూబిట్ సామర్థ్యం ఉన్న క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఇప్పటికే పలు క్వాంటం స్టార్టప్‌లు అమరావతిలో ఏర్పాటుకు ముందుకు వచ్చాయని తెలిపారు. స్పేస్, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ క్లస్టర్లతో భవిష్యత్ టెక్నాలజీ పరిశ్రమలకు అమరావతిని కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు.
వైద్య, విద్యా రంగాల్లోనూ ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతికి వస్తున్నాయని చెప్పారు చంద్రబాబు… వెట్, ఎస్ఆర్ఎం, అమృతానందమయి సంస్థలతో పాటు బిట్స్ పిలానీ, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి సంస్థలు కూడా రానున్నాయని వెల్లడించారు. సుమారు రూ.50 వేల కోట్ల విలువైన పనులు అమరావతిలో కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు కూడా రానున్నాయని చెప్పారు. అమరావతిలో హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌లో భాగంగా బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వంటి సంస్థలు వస్తున్నాయని తెలిపారు. బ్యాంకింగ్ స్ట్రీట్‌తో ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్రంగా అమరావతి మారుతుందని చెప్పారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రపంచస్థాయి కంటి వైద్యం, పరిశోధన, శిక్షణకు కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. సాంకేతికత, అవకాశాలను యువత అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!