Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
- నీళ్లు ఉన్నా రైతులకు సాగునీరు అందడం లేదన్న హరీశ్ రావు
- కేఎల్ఐ మోటార్లను పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్
- గోదావరి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శ
- 288 టీఎంసీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్కర్నూల్ జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకవర్గాల చేతగానితనం వల్లే రైతాంగం కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందని, నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎత్తిపోయకుండా ‘క్రాప్ హాలిడే’ పేరిట రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రకృతి లేదా కాలం తెచ్చిన కరువు కాదని, కేవలం కాంగ్రెస్ పాలకులు తెచ్చిన ‘కృత్రిమ కరువు’ అని ఆయన అభివర్ణించారు. గత ముప్పై ఏళ్లలో పూర్తికాని ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పరుగులు పెట్టించి, ఆయకట్టును 26 వేల ఎకరాల నుంచి ఏకంగా ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచిందని గుర్తుచేశారు.
నీళ్లు ఉన్నా ఎత్తిపోతల నిలిపివేత.. గురుదక్షిణ చెల్లిస్తున్నారా?
కేఎల్ఐ (KLI) ప్రాజెక్టులో మొత్తం 5 మోటార్లు ఉంటే కేవలం ఒకటి లేదా రెండు, మహా అయితే మూడు మోటార్లను మాత్రమే రోజుకు 8 గంటలు నడిపిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. మూడు మోటార్లను 24 గంటల పాటు నిరంతరాయంగా నడిపిస్తే పాలమూరు జిల్లాకు ప్రతిరోజూ 2,400 క్యూసెక్కుల నీటిని అందించవచ్చని, కానీ కేవలం 800 క్యూసెక్కుల నీటితో సరిపెడుతున్నారని విమర్శించారు. 4,000 క్యూసెక్కుల నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, శ్రీశైలంలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ నీటిని ఎందుకు ఎత్తడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 800 కిలోమీటర్ల దూరం నీళ్లను తీసుకెళ్లి కుప్పంలో పారిస్తుంటే, మన సీఎం మాత్రం సొంత జిల్లాకు నీళ్లు పారించలేకపోతున్నారని, తన రాజకీయ గురువుకు తక్కువ పడకూడదనే ఉద్దేశంతోనే ఇలా ‘గురుదక్షిణ’ చెల్లిస్తున్నారా అని ఎద్దేవా చేశారు.
Also Read
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
గోదావరి ప్రాజెక్టుల నిర్లక్ష్యం.. బాహుబలి మోటార్ల నిర్వహణ లోపం
కృష్ణా నదినే కాకుండా గోదావరి జలాల విషయంలోనూ ప్రభుత్వం ఇదే రకమైన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తోందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సమ్మక్క బ్యారేజ్ నిర్మించి ఏడాదిలో 365 రోజులు నీళ్లు ఎత్తిపోశామని వివరించారు. దేవాదుల వద్ద రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే నీటిని ఎత్తడం వల్ల వరంగల్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, అర టీఎంసీ నీటిని ఎత్తిపోస్తే వరంగల్ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో 145 మెగావాట్ల బాహుబలి మోటార్లను ప్రారంభించి, రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి 50 టీఎంసీల సామర్థ్యంతో నాలుగు రిజర్వాయర్లు నిర్మించి ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. ప్యాకేజీ-3లో 33 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని పూర్తి చేయకపోవడం వల్ల 50 టీఎంసీల నీటిని కోల్పోయామని విమర్శించారు. అలాగే పెద్ద మోటార్లను తరచూ ఆన్ , ఆఫ్ చేయకూడదని నిపుణులు హెచ్చరించినప్పటికీ వినిపించుకోకపోవడం వల్లే ఇప్పటికే ఒక మోటార్ కాలిపోయిందని, ప్యాకేజీ-3 పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి కరివెన వరకు రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.
288 టీఎంసీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. వాస్తవంగా 8.8 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసి, ఏకంగా 88 టీఎంసీలు ఎత్తామని అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న 34 శాతం తాత్కాలిక వాటాను ట్రిబ్యునల్ ద్వారా దక్కించుకోలేక, కేవలం 24 నుండి 25 శాతం మాత్రమే వాడుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు 288 టీఎంసీల నీటిని ఎక్కడ, ఎలా వాడిందో ప్రజలకు స్పష్టతనిస్తూ తక్షణమే శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద క్రాప్ హాలిడే ప్రకటించడం ద్వారా పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలను దారుణంగా వంచించారని హరీశ్ రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!