Telangana : బిగ్ న్యూస్.. చెరువుల పరిరక్షణలో కీలక మలుపు.. భూమి కోల్పోయేవారికి 400% వరకు భారీ పరిహారం.!
- చెరువులు-నాళాల పరిరక్షణకు నూతన TDR విధానం
- భూ యజమానులకు 200% నుంచి 400% వరకు భారీ లాభం
- రియల్ ఎస్టేట్ బిల్డర్లు కోసం TDR తప్పనిసరి వినియోగం
- వరదల నివారణతో పాటు పర్యావరణ లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో చెరువులు, నాళాల అభివృద్ధి పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారుతున్న తరుణంలో, మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి (MAUD) శాఖ వినూత్నమైన TDR (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నూతన విధానం ప్రకారం, నగరంలోని చెరువులు , నాళాల పరిరక్షణ కోసం తమ పట్టా భూములను వదులుకునే వారికి ప్రభుత్వం భారీ స్థాయిలో పరిహారాన్ని ఆఫర్ చేస్తోంది. చెరువుల ఎఫ్.టి.ఎల్ (FTL) పరిధిలో భూమి కోల్పోయిన వారికి 200 శాతం, బఫర్ జోన్ పరిధిలో భూమి ఇచ్చే వారికి 300 శాతం, బఫర్ జోన్ వెలుపల లేదా నాళాల వెడల్పు పెంపు కోసం భూమి అప్పగించే వారికి ఏకంగా 400 శాతం TDR అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Tagatose : డయాబెటిస్ బాధితులకు ‘స్వీట్’ న్యూస్.. చక్కెరలా రుచి.. కానీ రిస్క్ కాదు.!
Also Read
ఈ ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ, కేవలం సరైన రెవెన్యూ పత్రాలు , యాజమాన్య హక్కులు ఉన్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం కల్పిస్తారు. HMDA, GHMC, HYDRA , MRDCL వంటి ప్రభుత్వ సంస్థలు చేపట్టే పునరుద్ధరణ పనుల కోసం భూమిని అప్పగించిన వెంటనే ఈ TDR సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఒకవేళ సదరు భూమి ఏదైనా వివాదంలో ఉంటే, ఆ సర్టిఫికెట్లను ప్రత్యేక TDR బ్యాంక్‌లో ఉంచి, న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత అసలైన యజమానికి అందజేస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి నగదు రూపంలో భూసేకరణ భారం తగ్గడమే కాకుండా, భూమి కోల్పోయిన రైతులకు లేదా యజమానులకు మార్కెట్ విలువ కంటే రెట్టింపు స్థాయిలో లబ్ధి చేకూరుతుంది. ఈ చర్య ద్వారా నగరంలోని జలవనరులను కాపాడటంతో పాటు వరదల ముప్పును శాశ్వతంగా నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, ఈ TDR సర్టిఫికెట్లకు మార్కెట్‌లో డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఇకపై నగరంలో 10 అంతస్తులకు మించి నిర్మించే ప్రతి హైరైజ్ భవనంలో, మొత్తం నిర్మిత ప్రాంతం (Built-up Area)లో 10 శాతాన్ని తప్పనిసరిగా TDR ద్వారానే పొందాలని నిబంధన విధించింది. దీనివల్ల రియల్ ఎస్టేట్ డెవలపర్లు తప్పనిసరిగా భూమి కోల్పోయిన బాధితుల నుంచి ఈ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది, తద్వారా బాధితులకు త్వరితగతిన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా కాకుండా, భూ యజమానులకు లాభదాయకమైన అవకాశంగా మార్చడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం. సుప్రీం కోర్ట్ , గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటిస్తూనే, ప్రజలకు నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో , పర్యావరణ పరిరక్షణలో కొత్త మార్పులకు నాంది పలకనుంది.
తాజావార్తలు
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!