Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah Bhatia: హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే ఈ జానర్ ఫ్రాంచైజీలు కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. భయం, సస్పెన్స్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా భయపడుతూనే ఎంటర్టైన్ అవుతుంటారు. అలాంటి హారర్ థ్రిల్లర్ సిరీస్‌లలో ‘రాగిణి’ ఫ్రాంచైజీ ఒకటి. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సిరీస్ ఇప్పుడు మూడో అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. కొత్త కథ, కొత్త తారాగణం, కొత్త దర్శకుడితో రూపొందుతున్న ‘రాగిణి 3’ షూటింగ్ ఆఫీషియల్ గా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌లో తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ తొలి రోజు సందర్భంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో క్లాప్‌బోర్డ్‌తో దిగిన ఫొటోను ‘Day 01’ అంటూ పంచుకున్నారు. దీంతో ఆమె ‘రాగిణి 3’ షూటింగ్ లో చేరినట్లు స్పష్టమైంది. ఇక హారర్ జానర్లో తమన్నా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈసారి ‘రాగిణి 3’లో తమన్నాతో పాటు ఆయుష్ శర్మ, జునైద్ ఖాన్, నర్గీస్ ఫఖ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత భాగాల్లో కనిపించిన నటీనటులకు భిన్నంగా పూర్తిగా కొత్త తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదే ఈ సినిమాపై కొత్త ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు, ఈసారి దర్శకుడిగా శశాంక్ ఘోష్ బాధ్యతలు చేపట్టడం కూడా మరో విశేషం. గత భాగాలకు భిన్నంగా, ఈ సినిమా పూర్తిగా కొత్త కథాంశంతో రూపొందుతున్నట్లు సమాచారం. అతీంద్రియ శక్తులు, మానసిక ఉత్కంఠ, సస్పెన్స్ అంశాలను ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా కథను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. నిర్మాణ పరంగా కూడా ఈ చిత్రానికి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ ఫిల్మ్స్, జై హో మీడియా వెంచర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏక్తా కపూర్, శోభా కపూర్, అమర్ బుటాలా, కుమార్ తౌరానీ, గిరీష్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా సుధాకర్ రెడ్డి యక్కంటి పనిచేస్తున్నారు.
Also Read
ఇటీవలి కాలంలో హారర్ సినిమాలకు భారతీయ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం భయపెట్టే కథలకే పరిమితం కాకుండా, కంటెంట్, సస్పెన్స్, ఎమోషన్స్ తో రూపొందుతున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అదే దారిలో ‘రాగిణి 3’ కూడా ఫ్రాంచైజీకి కొత్త ఊపు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్, ఫస్ట్ లుక్, టీజర్, విడుదల తేదీ వంటి వివరాలను రాబోయే నెలల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కొత్త కథతో, కొత్త నటీనటులతో వస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
#Ragini3 with @tamannaahspeaks
Goes on Floors ✅The Ragini franchise has officially entered its next chapter. The third installment of the popular horror thriller series has gone on floors, bringing together a fresh cast and a new creative team. While the makers are keeping the… pic.twitter.com/0yoixsFQZ1
— Always Bollywood (@AlwaysBollywood) July 16, 2026
తాజావార్తలు
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!