తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో చెరువులు, నాళాల అభివృద్ధి పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారుతున్న తరుణంలో, మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి (MAUD) శాఖ వినూత్నమైన TDR (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నూతన విధానం ప్రకారం, నగరంలోని చెరువులు , నాళాల పరిరక్షణ కోసం తమ పట్టా భూములను వదులుకునే వారికి…