కేంద్ర గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు సీఎం కెసిఆర్ రానున్నారు.
ఈ సందర్బంగా కేంద్ర గెజిట్ పై కేసీఆర్ స్పందించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా… కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ గెజిట్లను విడుదల చేసింది కేంద్రం. అక్టోబర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి రానున్నది. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వస్తాయని కేంద్రం పేర్కొన్నది. కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టులను ఈ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చింది.