Sankranti Movies OTT Release: ఓటీటీలోకి సంక్రాంతి మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే, మరోసారి పండగే!
- ఓటీటీలోకి సంక్రాంతి 5 మూవీస్
- ఓటీటీ ప్రియులకు డబుల్ ట్రీట్
- స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే, మరోసారి పండగే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 సంక్రాంతి పండగకు థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో చూడలేకపోయినవారికి, మరోసారి ఫేవరెట్ సినిమాలను ఆస్వాదించాలనుకునేవారికి ఇది డబుల్ ట్రీట్ అనే చెప్పాలి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే సంక్రాంతి విడుదలైన మూవీస్ వరుసగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. దాంతో ఓటీటీ ప్రియులకు మరోసారి సంక్రాంతి పండగే.
సంక్రాంతి సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న మొదటి సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రం ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి స్పందన తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ‘రాజాసాబ్’ మూవీ డిజ్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. సంక్రాంతి బరిలో ప్రత్యేక అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ ప్రియులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
ఫిబ్రవరి 7న తమిళ మూవీ ‘పరాశక్తి’ జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సామాజిక అంశాలు, భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ఆసక్తి పెరుగుతోంది. ఫిబ్రవరి 11న ‘మన శంకర వరప్రసాద్ గారు’ జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో బిగ్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఓటీటీలో కూడా దూసుకుపోనుంది. ఫిబ్రవరి 13న రెండు సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా జీ5లో విడుదల కానుండగా.. ‘అనగనగా ఒక రాజు’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలు కూడా విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.
Also Read: T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌కు మెంటర్‌గా దినేశ్ కార్తిక్.. వాటే లక్కీ ఛాన్స్!
మొత్తంగా సంక్రాంతి సినిమాలతో ఫిబ్రవరి నెలంతా ఓటీటీలో పండగ వాతావరణం కనిపించనుంది. కుటుంబంతో కలిసి ఇంట్లోనే కూర్చొని సినిమాలను ఆస్వాదించే వారికి ఇది బెస్ట్ టైమ్ అని చెప్పాలి. థియేటర్ మిస్ అయినా, ఓటీటీ ద్వారా మరోసారి సంక్రాంతి ఫీల్‌ను ఎంజాయ్ చేయడానికి ఇదే మంచి అవకాశం.
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!