Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వానికి అందిన వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరంగల్ జిల్లాలో పంట నష్టం చోటు చేసుకోగా, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ రైతులు భారీగా నష్టపోయారు. తుఫాను కారణంగా ప్రధానంగా వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Weather Updates : గత మూడు రోజుల నుంచి రెండు విభిన్నమైన వాతావరణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. 40 నుంచి 41 సెల్సియస్ ఉష్ణోగ్రత గత వారం రోజులు బట్టి ఉంటుంది. దీంతో రోడ్ల పైన జనం తిరగటానికి ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండల దాటికి తట్టుకోలేకపోతున్నారు. జాతీయ రహదారుల్లో వాహనాల రొద కూడా కనపడటం లేదు…