ఎస్సీ రిజర్వేషన్ జాక్‌పాట్.. ఏకైక అభ్యర్థిగా మల్లమ్మ ఎంపిక వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామ పంచాయతీలో రిజర్వ్ సీటు కారణంగా కొంగర మల్లమ్మ సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. ఆ ఊరిలో 1,600 కి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, ఎస్సీ మహిళా రిజర్వ్ సీటు కారణంగా ఒక్కరే మహిళ ఉండటంతో.. మల్లమ్మకు ఈ పదవి లభించింది. గ్రామ పంచాయతీకి రిజర్వేషన్ కింద ఎస్సీ మహిళా స్థానంలో ఒక్కరు మాత్రమే ఉండటంతో సర్పంచ్ పదవి మల్లమ్మకు వెళ్లింది అని…
డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహేశ్వరం, మిర్ఖాన్ పేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి పోలీసుశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య భారీ బందోబస్త్ కల్పిస్తోంది. ఈరోజు మహేశ్వరంలో బందోబస్త్ మీద రాచకొండ సిపి సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టీజీ ICC ఏండి శశాంక్ మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి ట్రాఫిక్ డీసీపీలతో కలిసి…
Lionel Messi : ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తన ప్రతిభతో మంత్రముగ్ధులను చేసిన ఆర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ ఈ డిసెంబర్‌లో హైదరాబాద్ రానున్నాడు. The G.O.A.T India Tour – 2025లో భాగంగా భారత పర్యటనకు సిద్ధమైన మెస్సీ, ఈ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్‌ను సందర్శించనున్నట్టు అధికారికంగా వెల్లడైంది. ఫుట్‌బాల్ అభిమానులకు ఇది అద్భుతమైన అవకాశంగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ ప్రమోషన్‌లో భాగంగా, మెస్సీని రాష్ట్రానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా…
డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేండ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు సీఎంవో…
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న 12వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరై.. “విజన్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్” అంశంపై ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి…
CM Revanth Reddy : తెలంగాణలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో, సోమవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కలిశారు. ఈ సమావేశంలో, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణలోనే ఒక అంతర్జాతీయ ప్రమాణాల ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని అజయ్ దేవగణ్ సీఎం…
Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జాతీయ స్థాయి CA విద్యార్థుల సదస్సులో భాగంగా ముఖ్యోపన్యాసం ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. “CA అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఇది జాతి నిర్మాణంలో భాగస్వామ్యం. దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతను చార్టెడ్ అకౌంట్లు సమర్థంగా నిర్వహిస్తున్నారు,” అని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ, “మీ నిజాయితీయే మీ అత్యంత విలువైన ఆస్తి. టెక్నాలజీ, ఆటోమేషన్…
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం రూ.12,062 కోట్ల విలువైన పెట్టుబడులు, దాదాపు 30,500 ఉద్యోగాలు ఈ పర్యటన ద్వారా సాధ్యమయ్యాయి. ముఖ్య ఒప్పందాలు – కీలక వివరాలు: మారుబెని కంపెనీ : హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్…
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే మా లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులున్నాయని తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. "పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం.