Narendra Modi : రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అద్భుతమైన పాలన అందిస్తున్నారని ప్రధాని అభినందించారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరు శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీ సమన్వయ వ్యవహారం బాగా కొనసాగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇంకా దూకుడుగా వ్యవహరించాలని BJP ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యవహారాలపై, ప్రజా సమస్యలపై వైసీపీని మరింత టార్గెట్ చేస్తూ పోరాడాలని ప్రధాని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో మరింత చురుకుదనం అవసరమని ప్రధాని మోదీ అన్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు వేగంగా చేరువయ్యే అవకాశం ఉండటంతో, BJP నాయకులు మరింత యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.
Pakistan: కక్ష సాధిస్తున్న అసిమ్ మునీర్.. మాజీ ఐఎస్ఐ చీఫ్‌కు 14 ఏళ్లు జైలు శిక్ష..
తెలంగాణలో బీజేపీ పాత్రపై కూడా ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్ష పాత్రను మరింత బలంగా పోషించాలని సూచించారు. సోషల్ మీడియా రంగంలో కూడా తెలంగాణ BJP వెనుకబడిందని మోదీ స్పష్టం చేశారు. అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా బీజేపీ కంటే తెలంగాణలో బలంగా పనిచేస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. డిజిటల్ వేదికల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడంలో పార్టీ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలే ప్రజలకు చేరుకునే ప్రధాన వేదికలుగా మారాయని, అందువల్ల ఈ రంగంపై మరింత దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ నేతలకు సూచించారు.
Telangana Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాసేపట్లో ఫలితాలు!