బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా ఉంటూ.. రివాల్వర్‌తో బెదిరించి ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్.. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.. మారేడ్‌పల్లి సీఐగా ఉన్న నాగేశ్వరరావు.. వనస్థలిపురం పరిధిలో ఓ మహిళను కిడ్నాప్ చేసి… ఆపై తన సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.. దీంతో, నాగేశ్వరరావుపై కిడ్నాప్‌తో పాటు అత్యాచారం నేరాల కింద వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదైంది.. దీంతో, ఇప్పటికే నాగేశ్వరరావును సస్పెండ్ చేశారు.. అరెస్ట్ చేశారు. కొంతకాలం పాటు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న నాగేశ్వరరావు.. ఇటీవలే షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, నాగేశ్వరరావు తీవ్ర నేరాలకు పాల్పడిన నేపథ్యంలో ఆయనను సర్వీస్ నుంచి తొలగించాలంటూ.. హైదరాబాద్ సీపీ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపదా.. వాటికి సర్కార్ ఆమోదం తెలిపింది.. దీంతో, నాగేశ్వరరావును సర్వీసు నుంచి పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీపీ సీవీ ఆనంద్.
Read Also: Vegetarian Crocodile: భక్తులను ఆశీర్వదించే శాఖాహార మొసలి కన్నుమూత..
కాగా, వివాహితపై అత్యాచారం కేసులో సీఐ నాగేశ్వర్‌రావును 3 నెలల క్రితం అరెస్ట్ చేసి వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మొదట ఆయనపై సస్పెండ్ వేటు పడింది.. నాగేశ్వర్ రావు 2 నెలలకు పైగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక, రెండుసార్లు ఎల్బీనగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా.. బెయిల్ రాలేదు.. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన నాగేశ్వర్‌రావుకు సెప్టెంబర్ 28న కండీషనల్ బెయిల్ వచ్చింది.. దీంతో చర్లపల్లి జైలు నుంచి నాగేశ్వరరావు విడుదలయ్యారు. మరోవైపు.. డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవారే ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు.. నాగేశ్వర్‌రావును డిస్మిస్ చేశారు.. పోలీసులే.. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు.. గతేడాది డిసెంబర్ 25న హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. ఇప్పటి వరకు 55 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు.. మాజీ సీఐ నాగేశ్వర్ రావును డిస్మిస్ చేసిన సందర్భంగా గత 10 నెలల కాలంలో ఇతరులపై తీసుకున్న చర్యల గురించి సీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.