కాంగ్రెస్ పార్టీలోని ఇంటి దొంగలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని ఇంటి దొంగలను విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు.. నెలాఖరు వరకు కాంగ్రెస్ ఇంటి దొంగలకు డెడ్‌లైన్ ఇస్తున్నా.. ఇంటి దొంగలను వదిలిపెట్టేదిలేదన్న ఆయన.. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేవాడు ఉంటే వదులుకునేది లేదన్నారు.. పార్టీకోసం కష్టపడేవాళ్లను గుండెల్లో చేర్చుకుని, దగ్గర పెట్టుకుని చూసుకునే బాధ్యత మాదన్న ఆయన.. కానీ, ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే పరారు అవ్వాలంటూ వార్నింగ్ ఇచ్చారు. కాగా, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు.. అధికార టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కు అయినట్టు ఆరోపణలు ఉన్నాయి.. బయట సీఎం కేసీఆర్, అధికారపార్టీపై నిప్పులు చెరిగే నేతలు.. పార్టీ రహస్యాలను కూడా అధికార పార్టీ నేతలను చేరవేస్తారనే ఆరోపణలను సొంత పార్టీ నేతలే చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.