Telangana: ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలపై మంత్రుల సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానాలు కురుస్తూనే ఉన్నాయి. కామాారెడ్డి, నిర్మల్, బైంసా పట్టణాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. నిర్మల్ లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన నిర్మల్ పట్టణంలోని శాస్తి నగర్, శాంతి నగర్, మంచిర్యాల చౌరస్తా, నటరాజ నగర్ , బుధవార్ పేట్, హరిజన వాడ, డాక్టర్స్ లేన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను, నాలాలను పరిశీలించారు.
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్‌లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్‌వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
వర్షాలు మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. భైంసాలోని ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఉండి పోయిన ఆరుగురి కోసం అధికారుల సహాయక చర్యలు ప్రారంభించారు.. తెప్పల సాయంతో గార్డెన్ లో చిక్కుకున్న ప్రజలను రెస్య్కూ చేస్తున్నారు. బాసర రవీంద్ర పూర్ లో వరద పోటెత్తింది. మత్స్యకారుల సహాయంతో తెప్పల సాయంతో 20 మందిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read Also: IND Vs ENG: రెండో టీ20లోనూ మనదే ఫస్ట్ బ్యాటింగ్.. ఓపెనర్లుగా రోహిత్, పంత్
భారీ వర్షాల నేపథ్యంలో నిజామామాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష జరిపారు. డిజాస్టర్ మెనేజ్మెంట్ తో పాటు అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజల అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని..జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని.. స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!