హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది.. ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న దేవేందర్ కుమారుడిగా చెబుతున్నారు.. కొండాపూర్ సెంట్రల్ పార్క్ లోని ఇంట్లో తల్లి తండ్రులతో కలిసి ఉంటున్న అక్షయ్.. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నా.. ఓ పాత కేసు ఆత్మహత్యకు కారణంగా ప్రచారం సాగుతోంది.. అక్షయ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.
Read Also: Narendra Modi: చిరంజీవిపై మోడీ ప్రశంసల వర్షం..
కాగా, ఆత్మహత్య చేసుకున్న అక్షయ్ ఈ మధ్యే డబుల్ బెడ్ రూమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.. ఆ ఆరోపణలపై ఈ మధ్యే అరెస్ట్ కూడా అయ్యాడు.. 12 రోజుల పాటు జైలులో కూడా ఉండి వచ్చాడు.. మహబూబ్ నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు అక్షయ్.. అయితే, ఆ క్రమంలోనే డబుల్ బెడ్ రూమ్ స్కామ్‌లో ఇరుక్కున్నాడు.. ఇక, ఈ మధ్యనే సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు.. కానీ, ఆత్మహత్య చేసుకుని.. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాడు.. అసలు అక్షయ్ ఆత్మహత్యకు.. ఆ కేసే కారణమా? మరేమానా కారణాలు ఉన్నాయా? అనే విషయం తెలియాల్సి ఉంది.