Harish Rao: మెడికో ప్రీతి ఘటన బాధాకరం.. పూర్తిస్థాయిలో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: వైద్య విద్యార్థిని ప్రీతి ఘటన బాధాకరం.. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది అన్నారు మంత్రి హరీష్‌రావు.. ప్రీతి కేసులో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన ఆయన.. నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా వైద్యులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.. ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు.. ప్రీతి తల్లితండ్రులతో ఫోన్‌లో మాట్లాడి మనో ధైర్యం చెప్పిన మంత్రి… వైద్యులతో గంట గంటకు స్వయంగా మాట్లాడుతూ ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు.. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం.. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి హరీష్‌రావు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
కాగా, కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌పై క్రైమ్ నంబర్ 69/2023 u/s 306 r/w 108 , 354 of IPC, 4(v) of ragging act, 3(1)(r), 3 (2)(va),3 (1)(w)(ii) of sc st act నమోదు చేశామని వరంగల్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి.. ఈ కేసు నమోదు చేశామని తదుపరి విచారణ అనంతరం శాఖ పరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు.. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే నని దోషులు ఎప్పటికైనా తప్పించు కోలేరని స్పష్టం చేశారు.. అయితే, సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని.. అందరూ సంయవనం పాటించాలని వరంగల్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ బోనాల కిషన్ సూచించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!