Harish Rao: వైద్య విద్యార్థిని ప్రీతి ఘటన బాధాకరం.. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది అన్నారు మంత్రి హరీష్‌రావు.. ప్రీతి కేసులో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన ఆయన.. నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా వైద్యులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.. ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు..…