MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- 15 భద్రతా ఫీచర్లతో కొత్త సర్టిఫికెట్ల రూపకల్పన
- తడిసినా, చినిగిపోకుండా ఉండేలా ప్రత్యేక పేపర్
- ప్రజాభవన్‌లో కొత్త విధానాన్ని ప్రారంభించిన శ్రీధర్‌బాబు
- నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాప్రయోజనాల దృష్ట్యా పౌరులకు అందించే సేవలను మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువపత్రాలను (సర్టిఫికెట్లు) ఇకపై మరింత పటిష్టంగా , ఎక్కువ కాలం మన్నేలా ప్రత్యేకమైన నాణ్యతతో అందించనున్నారు. ఎంతో భద్రంగా, ఏళ్ల తరబడి భద్రపరుచుకునేలా రూపొందించిన ఈ కొత్త పేపర్ విధానాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రజాభవన్‌లో లాంఛనంగా ప్రారంభించారు.
15 అత్యాధునిక భద్రతా ఫీచర్లు.. లామినేషన్ అవసరం లేని ప్రత్యేకత
సాధారణంగా ప్రజలు తమ ముఖ్యమైన ధ్రువపత్రాలు పాడవకుండా ఉండటానికి వాటిని లామినేషన్ చేయించుకోవడం పరిపాటి. అయితే ఈ కొత్త విధానం ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లకు ఇకపై ఎలాంటి లామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. సుమారు 15 రకాల అత్యాధునిక భద్రతా ఫీచర్లతో ఈ కొత్త పేపర్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. దీనివల్ల ఈ సర్టిఫికెట్లు ఎంతకాలమైనా చినిగిపోకుండా, ఒకవేళ నీటిలో తడిసినా కూడా ఎలాంటి చెరుపుకు గురికాకుండా అత్యంత సురక్షితంగా ఉంటాయి. పౌరులకు అందించే సేవల్లో నాణ్యతను పెంచడంతో పాటు నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేయడంలో ఈ కొత్త భద్రతా ప్రమాగాలు ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
తాజావార్తలు
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!