Telangana : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యా రంగంలో మరో ముఖ్యమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను శనివారం నుంచి విజయవంతంగా అమలు చేసింది. విద్యా రంగంలో డిజిటల్ మార్పుకు ఇది ఒక కీలక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థుల హాజరు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదు అవుతుంది. ప్రాక్సీ హాజరు లేదా రికార్డుల్లో తారుమారు…
రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని.. E-KYC తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును E-KYC చేశామని.. దేశంలో 95 శాతం ఈకైవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 4,24,59,028 మందికి ఈకైవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మంది కి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని…
Registrations : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలు అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ఆధునీకరణ కొనసాగుతున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా, కేవలం 10–15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. మొదటి దశగా రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 22 కార్యాలయాల్లో ఈ విధానం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి…