Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- డీకే శివకుమార్ కాలర్ పట్టి లాగిన రాహుల్ గాంధీ..
- వైరల్ వీడియోపై అస్సాం సీఎం హిమంత విమర్శలు..
- రాహుల్‌కు అహంకారమంటూ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకంగా ఇండీ కూటమి నేతలు సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను రాహుల్ గాంధీ కాలర్ పట్టి వెనక్కి లాగిన వీడియో వైరల్ అయింది.
దీనిపై బీజేపీ నేతలు కాంగ్రెస్, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు. అస్సాం సీఎం హిమంత.. ‘‘డీకే శివకుమార్ ఒక వ్యక్తి మాత్రమే కాదని, కర్ణాటక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని బహిరంగంగా అవమానించడాన్ని ఆయన ఎలా అంగీకరిస్తారు’’ అని ప్రశ్నించారు. ‘‘2015లో నేను అవమానాన్ని సహించలేదు. గర్వించే అస్సామీగా నా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాను. దేవుడు నాకు మేలు చేశారు’’ అని హిమంత ఎక్స్‌లో రాశారు. రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రతిష్టను కొత్తగా చూపించేందుకు ప్రయత్నించినా, ఆయనలో అహంకారాన్ని దాచలేరని విమర్శించారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
ఇదే వీడియోపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాలను పక్కన పెడితే, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువంటి బహిరంగ అవమానం 7 కోట్ల కన్నడిగుల గౌరవానికి భంగం కలిగించడమే’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనను రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో వీరేంద్ర పాటిల్‌ను కర్ణాటక సీఎం పదవి నుంచి తొలగిస్తున్నట్లు అనాగరికంగా ప్రకటించడంతో పోల్చారు.
2015లో కాంగ్రెస్‌ను వీడిన ఘటనను గుర్తుచేసుకున్న హిమంత..
రాహల్ గాంధీతో తనకు విభేదాలు ఏర్పడిన సంఘటనను హిమంత గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడానికి, అప్పట్లో రాహుల్ గాంధీతో జరిగిన సమావేశం తన నిర్ణయానికి కారణమైందని పలుమార్లు హిమంత చెప్పారు. 2016లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాహుల్ గాంధీ నివాసంలో అస్సాం కాంగ్రెస్ విభేదాల గురించి చెబుతున్న క్రమంలో, రాహుల్ గాంధీ తన పెంపుడు కుక్కకు ఒక ప్లేట్లో బిస్కేట్లు ఇచ్చాడని, అదే ప్లేట్లో వచ్చి న నాయకులు కూడా బిస్కెట్లు ఇచ్చారని హిమంత ఆరోపించారు. ఆ తర్వాత నుంచి హిమంత చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు చేశారు.
In 2015, I refused to swallow humiliation, as a proud Assamese. God was kind to me.
The Chief Minister of Karnataka is not just an individual. He is a constitutional office, and the face of a State with a glorious history, a rich culture and deep pride.
Will he bow to this public humiliation?
“Reinvention” can’t hide arrogance. Change the mask all you like; the face beneath stays the same.
— Himanta Biswa Sarma (@himantabiswa) October 13, 2026
తాజావార్తలు
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!