Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- ఢిల్లీలో ప్రతిపక్ష నేతలకు రాహుల్ గాంధీ టీ పార్టీ..
- పార్లమెంట్‌కు మార్చ్ తర్వాత కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇండీ కూటమి నేతలతో కలిసి సుప్రీంకోర్టుకు సోమవారం మార్చ్ నిర్వహించారు. సీఈసీని తొలగించడంతో పాటు ఈసీ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ హై ఓల్టేజ్ ధర్నా తర్వాతి రోజు మంగళవారం రాహుల్ గాంధీ తన నివాసంలో ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజంలోని ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీరందరితో ‘‘టీ పార్టీ’’ ఏర్పాటు చేశారు.
రాహుల్ గాంధీ ఢిల్లీలోని సునెహ్రా బాగ్రోడ్లోని తన నివాసంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలతో పాటు విద్యార్థి సంఘాలను కలుపుకుని ఉద్యమాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో మనమంతా కలిసే ఉన్నాం. ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతుంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Also Read
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
సుప్రీంకోర్టుకు సోమవారం జరిగిన మార్చ్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్, సీపీఐకి చెందిన డి. రాజా, సీపీఐ(ఎం)కి చెందిన ఎం.ఏ. బేబీ, ఎన్‌సిపి-ఎస్పికి నుంచి సుప్రియా సూలేలతో పాటు విద్యార్థి నేత నేహా బోరా పాల్గొన్నారు.
आज मैंने INDIA गठबंधन के नेताओं, विपक्षी सांसदों, छात्र संगठनों और सिविल सोसाइटी के साथियों को अपने घर चाय पर बुलाया है।
लोकतंत्र की रक्षा के इस जनांदोलन में हम सब एक साथ हैं – और ये आंदोलन लगातार जारी रहेगा।
चाय के बाद हम सभी मिलकर मीडिया के सामने अपनी बात रखेंगे।
All protests are one.
#Unity— Rahul Gandhi (@RahulGandhi) October 13, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!