Ganesh Visarjan : గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం ట్విన్ సిటీలు సహా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జనం రోజున ప్రజా రద్దీ అధికంగా ఉండటం, భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Nara Lokesh : “నేను ఎవ్వరిని వదిలిపెట్టను.. రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది”
అయితే, ఈ సెలవు కారణంగా వచ్చే నెలలో రెండో శనివారం అయిన అక్టోబర్ 11న సాధారణ పనిదినంగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అంటే అక్టోబర్ 11 శనివారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు యథావిధిగా పని చేయనున్నాయి. ఈ నిర్ణయం జంటనగరాల ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు వర్తించనుంది. సంబంధిత విభాగాలు, అధికారులు ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.