ప్రంపంచ దేశాలన్నింటిని వణికించిన కరోనా మహమ్మారి కథ ఇక ముగిసినట్లేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కొత్త వేరియంట్లు వస్తే తప్ప కరోనాను పట్టించుకోనవసరం లేదన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం సీజనల్ వ్యాధుల తీవ్రత పెరిగిందని.. ఇప్పుడు వాటితోనే పోరాడాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో టైఫాయిడ్‌తో పాటు మలేరియా, డెంగీ తదితర కేసులు పెరుగుతున్నాయని.. వాటిపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు. అయితే.. కరోనా చివరి దశకు చేరుకుందని, ఇకపై ఆ వైరస్ సాధారణ జ్వరం, జలుబు మాదిరిగానే ఉండనుందని స్పష్టం చేశారు.
ఈనేపథ్యంలో.. కరోనా ఓ సీజనల్ వ్యాధిగా మారిపోయిందని, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో 5వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నా మరణాల సంఖ్య జీరోగా ఉందని, అలాగని ప్రజలు మాస్కులు ధరించడం ఆపొద్దని, దానిద్వారా క్షయ, జలుబు, ఫ్లూ తదితర అంటువ్యాధుల నుంచి రక్షణ పొందాలని అన్నారు. అంతేకాకుండా.. కోవిడ్ సోకినవారు 5రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని, లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే ఆస్పత్రిలో చేరాలని శ్రీనివాసరావు సూచించారు. కొద్ది మందికి కొవిడ్ తో సన్నిహితంగా మెలిగిన వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొందని వెల్లడించారు. అయితే.. బాధితులు ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులుంటే ఫోన్ నెంబర్ 91541 70960కు చేయాలని సూచించారు.
TS-EAMCET 2022: షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్.. ఎలాంటి మార్పు లేదు..