Corbevax approved as precaution dose for adults: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమలో మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. బయోటాజికల్ ఇ సంస్థ తయారు చేసిన ‘కార్బెవాక్’ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికి బూస్టర్ డోస్ గా కార్బెవాక్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రాథమికంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా కార్బెవాక్ ను బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చని…
Covid 19 Updates:ఇండియాలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 15 వేలకు ఎక్కువగా నమోదవుతున్న కేసులు చాలా రోజుల తరువత 15 వేలకు దిగువన నమోదు అయ్యాయి. గత వారంలో అయితే రోజూవారీ కేసుల సంఖ్య 20 వేలను కూడా దాటింది. గడిచిన 24 గంటల్లో మాత్రం ఇండియాలో కేసులు, మరణాల సంఖ్య తగ్గింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 34,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మరణించారు. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,73,722 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం మృతుల సంఖ్య 3,975కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 కేసులు వెలుగు చేశాయి. కరీంనగర్ జిల్లాలో 14 కరోనా కేసులు గుర్తించారు. గడిచిన 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు.…
కరోనా మహమ్మరి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసింది. కరోనా బారినపడి ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. కరోనాతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్దాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం కొవిడ్ టీకాలను తీసుకువచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీకా ఉత్సవ్ విజయవంతమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా తరువాత 100 కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ మైలురాయి దాటిన రెండవ దేశంగా భారతదేశం చరిత్ర లిఖించింది. అంతేకాకుండా కొవిడ్ టీకాలపై అపోహలు పక్కన పెట్టి…
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.. కొన్ని సార్లు ప్రత్యేక డ్రైవ్ ద్వారా విస్తృతంగా వ్యాక్సిన్ వేస్తున్నారు అధికారులు.. అయితే, బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మరికొన్ని రోజులు వ్యాక్సినేషన్‌కు సెలవులు ప్రకటించారు అధికారులు.. రేపు అనగా 14వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు, 14వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను…
వ్యాక్సిన్ల కొరత రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది.. తెలంగాణలోనూ అదే పరిస్థితి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్.. కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ వ్యాక్సినేషన్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన అందిరికీ వ్యాక్సిన్…