Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కరీంనగర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై నిప్పులు చెరిగారు. ఉద్యమం పేరుతో ఉమ్మడి కరీంనగర్, పాలమూరు ప్రజలను కేసీఆర్ వాడుకుని వదిలేశారని ధ్వజమెత్తారు. అమెరికాలో ఉండి వచ్చిన కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంధించిన ఘాటు ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కుటుంబాలను పోషించుకోవడానికి నానా తంటాలు పడుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు కూడబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. “అమెరికాకు వెళ్లిన కేటీఆర్ అక్కడ ఎన్ని బాత్రూమ్లు కడిగినా, ఎన్ని హోటళ్లలో ఎన్ని చిప్పలు కడిగినా వేల కోట్లు ఎలా వచ్చాయని మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. నేనూ అదే అడుగుతున్నా.. ఎన్ని లక్షల చిప్పలు కడిగితే, ఎన్ని వేల బాత్రూమ్లు శుభ్రం చేస్తే లక్ష కోట్ల రూపాయల సంపాదన వస్తుంది కేటీఆర్? మా గల్ఫ్ కార్మికులు ఎడారుల్లో చావుబతుకుల మధ్య కష్టపడుతుంటే, కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చిందో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి” అని రేవంత్ గర్జించారు.
కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ఎండగడుతూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “2004లో మెదక్ జిల్లాను వదిలి పచ్చగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్‌కు కేసీఆర్ వచ్చారు. ఇక్కడి ప్రజలు ఆయన్ను చిన్నచూపు చూడకుండా గుండెల్లో పెట్టుకుని మూడుసార్లు ఎంపీగా గెలిపించారు. కానీ ప్రజలను వంచించి మోసం చేయడంతో.. ఇక్కడి రైతన్నలు, నేతన్నలు మానేరు వాగులో గోతి తీసి పాతిపెడతారని భయపడి 2009లో పాలమూరుకు పారిపోయి వచ్చారు. మేం కూడా తెలంగాణ వస్తుందన్న ఆశతో పాలమూరు నుంచి ఆయన్ను ఢిల్లీకి పంపిస్తే.. రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మమ్మల్ని కృష్ణా నదిలో ముంచి, మా వలసలు ఆపకుండా గజ్వేల్‌కు జంప్ అయ్యారు” అని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంతో తన కొడుకును సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి రాష్ట్రాన్ని ధనిక కుటుంబంగా దోచుకున్న కేసీఆర్ పాలనలో కార్మికుల తలరాతలు మారలేదని రేవంత్ అన్నారు. సిరిసిల్ల అంటే సిరులకు నిలయం అని అర్థం.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది.. ధైర్యం, దైవం కలిసిన ప్రాంతం సిరిసిల్ల.. 2009 ఎన్నికల్లో కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి నిలబెట్టాడు.. ఆనాడు కేటీఆర్ చావు తప్పి కన్నులొట్టబోయినట్టు సిరిసిల్లలో గెలిచాడు.. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయే కార్మికుల మృతదేహాలను స్వదేశానికి రప్పించడంతో పాటు, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించే సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు. కరీంనగర్, పాలమూరు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర కేసీఆర్‌దేనని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!