నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌరవ్ డైరెక్షన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘హాయ్ నాన్న’. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేసారు. డాటర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ లాంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ లో మృణాల్-నానిల పెయిర్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ జంటగా కనిపిస్తున్నారు. ఈ గ్లిమ్ప్స్ లో మృణాల్ ఠాకూర్ చాలా అందంగా కనిపించి ఆకట్టుకుంది. సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ రేంజ్ ఎక్కడికో వెళ్లింది. సీత పాత్రలో మృణాల్ చేసిన పెర్ఫార్మెన్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఒక యువరాణి ఎలా ఉండాలో అంతే హుందాగా, చీరకట్టులో చాలా అందంగా కనిపించి యూత్ ని మాయ చేసింది మృణాల్. ఈ దెబ్బకి కుర్రాళ్లంతా ‘సీతా సీతా’ అంటూ మృణాల్ జపం చేసారు.
సీతారామాం సినిమా తర్వాత మృణాల్ గ్లామర్ రోల్స్ ఎక్కువగా ప్లే చేస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ స్టిల్స్ నే పోస్ట్ చేస్తూ వచ్చింది. దీంతో ఏమైంది సీతా ఇలాంటి ఫొటోస్ పెడుతున్నావ్ అంటూ నెగటివ్ కామెంట్స్ కూడా చేసారు. ఇవేమి పట్టించుకోకుండా తన క్యారెక్టర్ ఏం కోరుకుంటే అది మాత్రమే చేస్తూ వచ్చిన మృణాల్ ఠాకూర్, మరోసారి సీతారామం సినిమాలోని ‘సీత’ని గుర్తు చేసే అంత ట్రెడిషన్ అండ్ ట్రెండీగా కనిపించింది ‘హాయ్ నాన్న’ లేటెస్ట్ పోస్టర్ లో. ఈరోజు మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు కావడంతో ‘హాయ్ నాన్న’ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. కలర్ ఫుల్ గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ని మృణాల్ బ్యూటిఫుల్ గా కనిపించింది. చిన్న నోస్ రింగ్, ఫ్లోరల్ డిజైన్ డ్రెస్ లో మృణాల్ మెస్మరైజ్ చేసేలా ఉంది. మరి డిసెంబర్ 21న రిలీజ్ కానున్న హాయ్ నాన్న మూవీ మృణాల్ ఠాకూర్ కి మరో సీతారామం రేంజ్ సినిమా అవుతుందేమో చూడాలి.
Wishing a very Happy Birthday to the one and only @MissThakurani 🎉 Your charm and talent know no bounds. May you continue to rule our hearts forever! ❤️🔥 Team #HiNanna #NaturalStar🌟 @NameisNani @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri… pic.twitter.com/Zi5NmNTtGs
— Vyra Entertainments (@VyraEnts) August 1, 2023