కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం సాగగా… కేంద్ర ప్రభుత్వం గెజిట్లతో వివాదాలకు తెరదింపాలని చూసింది.. కానీ, వాటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు.. కృష్ణా నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీప్ మురళీధర్‌రావు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 2021-22 ఏడాదికి 50 శాతం నీటిని కేటాయించాలని లేఖలో కోరారు.. ఇతర బేసిన్లకు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించకుండా చూడాలని లేఖలో కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ ప్రభుత్వం.